మునుగోడులో బీజేపీ బిల్డప్ అంతా డొల్లేనా? టీఆర్ఎస్ దే పై చేయి అంటున్న సర్వే

Publish Date:Aug 12, 2022

Advertisement

మునుగోడులో బీజేపీకి అంత సీన్ లేదా? కోమటి  రెడ్డి రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిన బీజేపీకి మునుగోడులో భంగపాటు తప్పదా? అంటే తాజా సర్వే ఫలితం ఔననే అంటోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కలిసి వచ్చినట్లు మునుగోడులో బీజేపీకి ఎంత మాత్రం కలిసి వచ్చే అవకాశాలు లేవని, ఇప్పటి దాకా రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన బిల్డప్ అంతా డొల్లేనని మునుగోడు ఫలితం తేల్చేస్తుందనీ ఆ సర్వే బల్ల గుద్ది మరీ చేబుతోంది. మునుగోడులో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యేనని బీజేపీ మూడో స్థానానికి పరిమితమౌతుందని పేర్కొంది. సాస్ గ్రూప్  ఆత్మసాక్షి సర్వే గ్రూప్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్(ఐపిఎస్ఎస్) టీమ్ఈ సర్వేను చేయించింది.

 మండలాల వారీగా, కులాల వారీగా, లబ్ధి దారుల వారీగా ఈ సర్వే చేసినట్లు పేర్కొంది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో రెండు విధానాలలో సర్వే చేసినట్లు ‘ఓటా’ పేర్కొంది. ఒకటి రాండమ్ సర్వే కాగా మరొకటి సెలెక్టివ్ సర్వేగా వివరించింది. ఇలా జరిపిన సర్వేలో మునుగోడులో బీజేపీ పుట్టిమునగడం ఖాయమని తేలిందని పేర్కొంది. బీజేపీ మునుగోడు ఉప ఎన్నికలో మూడో స్థానానికే పరిమితమౌతుందని స్పష్టమైందని సర్వే పేర్కొంది.

ఈ నెల 8-11 తేదీల మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగితే  బీజేపీది బలం కాదు వాపు మాత్రమేనని తేలిపోవడం ఖాయమని సర్వే వెల్లడించింది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలోనూ ర్యాండమ్ పద్దతిలో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. నాంపల్లి మండలంలో 790  , మర్రిగూడ మండలంలో 390, చందూరు మండలంలో 850, మునుగోడు మండలంలో 589,చౌటుప్పల్ మండలంలో 1020, గట్టుప్పల్ మండలంలో 200, నారాయణ పూర్ మండలంలో 520 శాంపిల్స్ చొప్పున సర్వే చేసినట్లు వివరించింది.

నియోజకవర్గం మొత్తంలో 4350 మందిని ర్యాండమ్ గా ప్రశ్నించి వారి అభిప్రాయం తెలుసుకున్నట్లు వివరించింది.  దాదాపు అన్ని మండలాలలోనూ టీఆర్ఎస్ కే మొగ్గు కనిపించిందని సర్వే ఫలితం తేల్చింది. సగటు ఓటు షేరు తీసుకుంటే  టీఆర్ఎస్ కు 40శాతం, కాంగ్రెస్ కు 34.75 శాతం, బీజేపీకి 18 శాతంగా తేలిందని పేర్కొంది.  ఇతరులు 3.25 శాతంగా ఉండగా ఎటూ మొగ్గు చూపని వారు అంటే సైలెంట్ వోట్ ఫ్యాక్టర్ 4 శాతంగా సర్వే పేర్కొంది. దీనిని బట్టి రాష్ట్రంలో బీజేపీది వాపే కాదు బలమేనని సర్వే ఫలితం తేల్చేసింది.

మునుగోడులో ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్యేనని, నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రాజగోపాల రెడ్డి రాజీనామాకు రేవంత్ పై వ్యతిరేకత, కాంట్రాక్టులే కానీ నియోజకవర్గ అభివృద్ధి కాదని భావిస్తున్నారని పేర్కొంది.  మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ సర్కార్ చేనేత బీమా ప్రకటించిందనీ, దీర్ఘ కాలంగా ఇక్కడి ప్ర.జలు డిమాండ్ చేస్తున్నగట్టుప్పల్ మండలాన్ని ప్రకటించడంతో జనం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా సర్వే పేర్కొంది.  

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.