సాగర్ తో పాటు మరో అసెంబ్లీకి ఉప ఎన్నిక?  

Publish Date:Jan 2, 2021

Advertisement

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతోఖాళీ అయిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. మార్చిలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగే  అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నాగార్జున సాగర్ తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి  కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాకే చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక రావొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.  తాను బీజేపీలో చేరబోతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణా సంఘం నివేదికను ఏఐసీసీ కోరింది. దీంతో తిరుపతిలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, గతంలో చేసిన కామెంట్స్‌తో కూడిన రిపోర్ట్‌ను ఏఐసీసీకి క్రమశిక్షణా సంఘం పంపించింది. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా  రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి ఇచ్చే సమాధానం తర్వాత అతనిపై స్పీకర్ పై అనర్హత పిటిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందట. కాంగ్రెస్ అనర్హత పిటిషన్ ఇస్తే.. స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరపాల్సి  ఉంటుంది. 

బీజేపీలో చేరేందుకు ఏడాది క్రితమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ సందర్భంలోనే తెలంగాణలో బీజేపీనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని 
చెప్పారు. అప్పుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని అంతా భావించారు. అయితే అది ఎందుకో ఆగిపోయింది. కోమటిరెడ్డి బీజేపీలో చేరితే  స్పీకర్ ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ భావించింది. అదే జరిగితే స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చని భావించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఆ సమయంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందని ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఉప ఎన్నిక వస్తే మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనే అంచనాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు వచ్చారట. అందుకే కావాలనే  అప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరికను బీజేపీ పెద్దలు వాయిదా వేశారనే చర్చ జరుగుతోంది.  వరుస విజయాలతో తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడు మీద ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా గెలవొచ్చనే భావనలో బీజేపీ ఉందని చెబుతున్నారు.

 పార్టీ మారితే తనపై అనర్హత  వేసినా బీజేపీ నుంచి పోటీ చేసి మళ్లీ గెలుస్తాననే ధీమాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు ముహుర్తాన్ని ఆయన రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నిక రావొచ్చనే అంచనాతో బీజేపీ కూడా మునుగోడుపై  ఫోకస్ చేసిందంటున్నారు. పరిస్థితులన్ని తమకు  అనుకూలంగా ఉన్నాయని భావించిన వెంటనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని, ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుచరగణం ఉంది. 2020 మొదట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా కనిపించినా... మునుగోడులో మాత్రం పట్టు నిలుపుకున్నారు కోమటిరెడ్డి. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటిల్లోనూ కాంగ్రెసే మెజార్డీ డివిజన్లు గెలుచుకుంది. అందుకే తన గెలుపుపై ఫుల్ క్లారిటీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 

 కాంగ్రెస్ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై సీరియస్ గా  చర్చిస్తోందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ వేసే ముందు.. మునుగోడు పరిస్థితిపై సర్వే చేయించాలనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారట. అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటే మాత్రం రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ ఇవ్వకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.  అయితే మునుగోడు కాంగ్రెస్ కు బలమైన ప్రాంతమని, రాజగోపాల్ రెడ్డి వెళ్లినా అక్కడ మళ్లీ గెలిచే ఛాన్స్ కాంగ్రెస్ కు ఉందని కొందరు పీసీసీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడి మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక రావడం ఖాయమనే చర్చే ఎక్కువగా జరుగుతోంది.  మరోవైపు కోమటిరెడ్డి సోదరుల మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం నేపథ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే వెంకట్ రెడ్డి సీరియస్ గా తీసుకుని పని చేస్తారని చెబుతున్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటనతో మునుగోడు రాజకీయాలు వేడెక్కాయని తెలుస్తోంది. 

By
en-us Political News

  
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.