ఉత్కంఠ రేపుతున్న మునుగోడు కౌంటింగ్.. రౌండ్ రౌండ్ కూ మారుతున్న ఆధిక్యత

Publish Date:Nov 6, 2022

Advertisement

మునుగోడు ఉఫ ఎన్నిక కౌంటింగ్ ప్రతి రౌండ్ కూడా హార్స్ రేస్ ఫొటో ఫినిష్ లా ఉత్కంఠగా సాగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తే, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇలా రౌండ్ రౌండ్ కూ ఫలితం దోబూచులాడుతూ ఉత్కంఠను పెంచేస్తోంది. మొదటి నుంచీ పరిశీలకులు అంచనా వేసినట్లు గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్, అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. బీజేపీకి కాంగ్రెస్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని అంటున్నారు.

ఆ పార్టీ ఆశించినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కమలం గూటికి చేరకపోవడం.. అలాగే కాంగ్రెస్ ఓటు పెద్దగా బీజేపీకి అనుకూలంగా టర్న్ కాకపోవడం ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ బీజేపీ కంటే 613 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఉంది.  టీఆర్‌ఎస్ కు 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్ 8,200, బీఎస్పీ 907ఓట్లు వచ్చాయి.

ఇప్పటి వరకూ వెలువడిన ఫలితం సరళిని బట్టి చూస్తూ ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నిది చివరి వరకూ తేలే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఐదో రౌండ్ ఫలితం వెలువడటంలో జాప్యంపై హై డ్రామా నడిచింది.  టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తే తప్ప ఫలితం వెలువరించరా అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు.  ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది నైతిక ఓటమి అన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన రౌండ్ల ఫలితాలను గమనిస్తే బీజేపీ గెలవబోతున్నదని స్పష్టమౌతున్నదన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల స్వగ్రామంలో బీజేపీకి ఆధిక్యత లభించిందన్నారు. అలాగే మంత్రులు ఇన్ చార్జీలుగా ఉన్న ప్రాంతాలలో కూడా బీజేపీ ఆధిక్యత కనబరిచిందని చెప్పారు.  అలాగే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో అనుకున్నంత మెజారిటీ రాలేదని అంగీకరించారు. ప్రస్తతానికి టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నా.. రౌండ్ రౌండ్ కూ ఫలితం మారుతోందనీ, బీజేపీ విజయం తథ్యమనీ అయితే చివరి వరకూ హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పారు. 

By
en-us Political News

  
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.