దేశానికి మరో అసమర్థ హోం మంత్రి చిదంబరం : బీజేపీ
Publish Date:Jan 25, 2012
Advertisement
న్యూఢిల్లీ: ముంబై దాడులకు ముందు హోం మంత్రిగా ఉన్న శివరాజ్ పాటిల్ తరహాలోనే ప్రస్తుత హోం మంత్రి చిదంబరం కూడా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిది ప్రకాష్ జావ్దేకర్ ధ్వజమెత్తారు.దేశానికి మరో అసమర్థ హోం మంత్రి చిదంబరం విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని అదుపు చేయటంలోనే కాక గత రెండేళ్ళలో దేశంలో జరిగిన తొమ్మిది దాడులతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని శిక్షించలేకపోయినందుకు హోం మంత్రి చిదంబరం జాతికి సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హోం శాఖను ప్రక్షాళన చేసి పటిష్టవంతంగా పని చేయించటంలో చిదంబరం చేతులెత్తేసారన్నారు.దేశ భద్రతను కాపాడటంలో ముఖ్యపాత్ర వహించే నిఘా విభాగాల మధ్య సమన్వయం లోపించటంతో పరస్పర విరుద్ధ ప్రకటనలు వడుతున్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల మధ్య సమన్వయం లేక పోవడంతో ఆ సంస్థల పనితీరు కూడా మెరుగ్గా లేదన్నారు.
అంతేకాకుండా, చిదంబరం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముంబై, ఢిల్లీ, వారణాసి, ఆగ్రా, హైదరాబాద్ తదితర నగరాల్లో తొమ్మిది సార్లు బాంబు దాడులు చోటు చేసుకున్నా, ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేదని ప్రకాష్ జావ్దేకర్ గుర్తు చేశారు.
http://www.teluguone.com/news/content/mumbai-24-11223.html





