మల్లయోధుడే కాదు.. రాజకీయ దురంధరుడు ములాయం

Publish Date:Oct 10, 2022

Advertisement

స్వతంత్ర భారత  రాజకీయాల్లో ముఖ్యంగా రెండవ తరం రాజకీయ నేతల్లో ప్రముఖునిగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ సోమవారం(అక్టోబర్ 10) ఉదయం కన్ను మూశారు. సుమారు నెలన్నర రోజులుగా రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ములాయం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. అయన వయసు 82 ఏళ్ళు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు పర్యాయాలు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా, పది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్రమంత్రిగానూ సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

ములాయం సింగ్ యాదవ్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించినా, మల్ల యోధునిగా, రాజకీయ నేతగానే పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సోషలిస్ట్ నేత రామమనోహర్ లోహియా అంతేవాసిగా  రాజకీయ రంగ ప్రవేశం చేసిన ములాయం సింగ్ యాదవ్  జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో సాగిన, ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనతో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు.  నవంబర్‌ 22, 1939లో యూపీలోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆగ్రా వర్సిటీ పరిధిలోని బీఆర్‌ కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నారు. అనంతరం కర్హైల్‌లో లెక్చరర్‌గానూ పనిచేశారు.

రెజ్లింగ్‌ పట్ల ఎంతో మక్కువ ప్రదర్శించే ములాయం.. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయ మల్ల యోధుడిగా ఎదిగారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మాలతి దేవి కన్ను మూసిన తర్వాత, సాధనా యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ములాయం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అఖిలేష్ యాదవ్, మొదటి భార్య కుమారుదు. రెండవ భార్య కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌. ప్రతీక్‌ భార్య అపర్ణా యాదవ్‌ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
స్వతహాగా మల్ల విద్యలో పట్టున్న ములాయం రాజకీయాల్లోనూ మల్లయోధునిగా పేరు తెచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రేమతో నేతాజీగా పిలుచుకునే ములాయం 1960లలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం దేశంలో తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో తన జైత్రయాత్రను కొనసాగించారు. మూడు పర్యాయాలు సీఎంగా, ఏడు సార్లు ఎంపీగా, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని విశ్వాసం చూరగొన్నారు.

1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో 1996 నుంచి 1998 మధ్య దేశ రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. అనంతరం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 1989 నుంచి 1991వరకు తొలిసారి సీఎంగా కొనసాగగా.. 1993 నుంచి 1995, చివరగా 2003 నుంచి 2007 వరకు యూపీ సీఎంగా సేవలందించారు. దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో గానీ, అధికార కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో గానీ ములాయం నిర్మాణాత్మక పాత్ర పోషించారు. 

సోషలిస్టు నాయకుడు డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ములాయం చిన్న వయసులోనే రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచారు. మధు లిమాయే, రామ్ సేవక్ యాదవ్, కర్పూరి ఠాకూర్, జనేశ్వర్ మిశ్రా, రాజ్ నారాయణ్ వంటి వ్యక్తులతో పరిచయం తర్వాత 15 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లో చేరారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, వీపీ సింగ్‌, చంద్రశేఖర్ పనితీరుతో ప్రేరణ పొందారు. కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, విద్యార్థుల సంక్షేమం, హక్కుల రక్షణ కోరుతూ ములాయం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలో 1962 నుంచి 1963 వరకు ఇటావా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అరెస్టయి జైలుకు వెళ్లిన ములాయం.. 19 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. 1977లో తొలిసారి మంత్రి అయ్యారు. సహకార, పశుసంవర్దకశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1980లో లోక్‌దళ్‌ పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు. ఈ పార్టీ తర్వాత జనతాదళ్‌లో భాగమైంది.

ఇక అక్కడి నుంచి జనతా పరివార్ లో భాగంగా అడుగులు వేస్తూ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో అనేక పత్రాలు కీలక పదవులు చేపట్టారు. 1982లో యూపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఆయన.. 1985 దాకా ఆ పదవిలో కొనసాగారు. లోక్‌దళ్‌ పార్టీలో చీలిక ఏర్పడిన తర్వాత క్రాంతికారి మోర్చా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1990లో కేంద్రంలోని వీపీ సింగ్‌ ప్రభుత్వం పడిపోవడంతో చంద్రశేఖర్‌ సారథ్యంలోని జనతాదళ్‌‌ (సోషలిస్టు) పార్టీలో ములాయం చేరారు.

కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1991లో కాంగ్రెస్‌ తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో యూపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్‌ పార్టీపై బీజేపీ నెగ్గింది. అనంతరం 1992లో ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ములాయం సింగ్ యాదవ్ కు అన్ని పార్టీలలో మంచి మిత్రులున్నారు. అంతే కాదు తుది శ్వాస వరకు రాజకీయాలనే శ్వాశించిన ములాయం ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు.

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.