ముద్రగడ పద్మనాభరెడ్డికి ఘోర అవమానం!

Publish Date:Jun 21, 2024

Advertisement

ముద్రగడ పద్మనాభం జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ‘కాపు’ నాయకుడిగా సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాలలో రచ్చ చేసిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మారిపోయారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను తన పేరుకు ‘రెడ్డి’ తగిలించుకుంటానని శపథం చేసిన ముద్రగడ తన శపథాన్ని నెరవేర్చారు. ప్రభుత్వ గజిట్‌లో తన పేరు మార్చుకున్నారు. దాంతో గంగ, చంద్రముఖిగా మారినట్టు కాపు నాయకుడు కాస్తా ‘రెడ్డి’గా మారిపోయారు.. తన సామాజికవర్గానికి పూర్తిగా దూరమైపోయారు. కాపులు, రెడ్లు వేరు కాదని, ఇద్దరూ ఒకటేనని చరిత్ర చెబుతున్నప్పటికీ, ఇప్పుడున్న సమాజంలో కాపులు, రెడ్లు మేం వేరు వేరు.., డిఫరెంట్.. డిఫరెంట్ అనుకుంటూ వుంటారు. చరిత్రని పరిశీలిస్తే ఈ రెండు సామాజికవర్గాలూ ఒకటేనని అర్థమవుతుంది. సాధారణంగా రెడ్డి కులస్తుల క్యాస్ట్ సర్టిఫికెట్లో ‘కాపు’ అనే వుంటుంది తప్ప ‘రెడ్డి’ అని వుండదు. అయినప్పటికీ, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి కాపు కాదు.. పక్కా రెడ్డి. ఇకపై ఆయన కాపు రాజకీయాల్లో తల దూర్చడానికి వీల్లేదు. నేను కాపుల ప్రతినిధిని, కాపుల నాయకుడిని అని చెప్పుకోవడానికి వీల్లేదు. 

ఇంతకాలం కాపుల కోసం పోరాడుతున్నా అని రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన ముద్రగడకి, పేరు మార్చుకున్న సందర్భంగా ఘోర అవమానం జరిగింది. ఏ ఒక్క కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినా, ‘‘సార్.. మీరు పేరు మార్చుకోవద్దు.. మాకోసం చాలా చేశారు... మీరు మా నుంచి దూరం కావడం ఇష్టం లేదు... మీరు మాతోనే వుండాలి’’ అని అన్న దాఖలాలు వున్నాయా.. లేవు! పేరు మార్చుకుంటావో.. ఊరు మార్చుకుంటావో మాకెందుకంట అన్నట్టు సైలెంట్‌గా వుండిపోయారు. పోనీ, అలా రాకపోతే రాకపోయారు.. మరోసారి కాపుల వ్యవహారాల్లో తల దూరిస్తే తాట తీస్తాం అని వార్నింగ్ కూడా కాపు నాయకులు ఇచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాపు నాయకుడిగా చెలామణీ అయిన ముద్రగడకి ఇంతకంటే అవమానం మరొకటి వుంటుందా?

పవన్ కళ్యాణ్‌కి పద్మనాభరెడ్డి విషయంలో కాస్త సానుభూతి వుండేదట. ఏదో పెద్దమనిషి ఆవేశంగా పేరు మార్చుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అంత అవసరం లేదు.. ఆయన దగ్గరకి వెళ్ళి బుజ్జగించి, పేరు మార్చుకోకుండా చేయాలని అనుకున్నారట. ముద్రగడ కుమార్తెతో కూడా ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిపారట. అయితే ముద్రగడ మాత్రం నా శపథం చాణక్య శపథం.. నా శపథం మంగమ్మ శపథం కంటే మూడు రెట్లు ఎక్కువ అన్నట్టు బిల్డప్పు ఇచ్చారట. ఇక ఈ మనిషిని బతిమాలి వేస్టు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇంటికి వెళ్ళే ఉద్దేశాన్ని విరమించుకున్నారట. ముద్రగడని బుజ్జగించే ఉద్దేశంతో ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తే, అప్పుడాయన నేను మారనంటే మారనని బెట్టు చేస్తే అనవసరంగా తన టైమ్ వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఊరుకున్నట్టు సమాచారం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంతకాలం కాపులను కంగాళీ చేసినట్టు రెడ్లను కంగాళీ చేయకుండా వుంటారని ఆశిద్దాం.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.