అద్దె క‌ట్ట‌లేదని ఎమ్మార్వో కార్యాలయానికి తాళం

Publish Date:Jun 20, 2022

Advertisement

ఈ రోజుల్లో చాలామంది యువ‌తీ యువ‌కులు చ‌దువుకోవ‌డానికి వీలుగా, కాలేజీల‌కు ద‌గ్గ‌రి ప్రాంతాల్లో అద్దె ఇళ్ల‌ల్లో వుండ‌డం ప‌రిపాటి. కుంటుంబాలు కూడా త‌మ పిల్ల‌ల‌కు ర‌వాణా ఇబ్బందులు లేకుండా వుండేం దుకు సాధ్య‌మ‌యినంత‌వ‌ర‌కూ కాలేజీల‌కు, స్కూళ్ల‌కు ద‌గ్గ‌రి ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్ల‌లో వుంటున్నారు. ఇది ప్ర‌తీ ప‌ట్ట‌ణంలోనూ సాధార‌ణంగా క‌నిపించే సీన్‌. చ‌దువు అయి వెళ్లేట‌పుడో, పోనీ వేరే ప్రాంతానికి వెళ్ల‌వ‌ల‌సిన‌పుడో ఆ ఇంటి య‌జ‌మానికి చెల్లించ‌వ‌ల‌సిన అద్దె, క‌రెంటు బిల్లు  ఏమ‌న్నా వుంటే పూర్తిగా చెల్లించి మ‌రీ వెళ‌తారు.  ఆంధ్రా తెలంగాణా విడిపోయిన త‌ర్వాత ఆంధ్రా ప్రాంతంలో  కొన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు అద్దె ఇళ్ల‌లో వున్నాయి.  స్వంత భ‌వ‌నాలు ఇంకా లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఇంకా  కొన సాగుతోంది. 

అలా వున్న‌దే నంద్యాల జిల్లా పాముల‌పాడులోని ఎమ్మార్వో కార్యాల‌యం.  దీన్ని గురించి ప్ర‌త్యేక ప్ర‌స్థా వ‌న దేనికంటే .. ఈ కార్యాల‌యానికి కొత్త భ‌వ‌నం ఏర్పాట‌యింది. కానీ  కార్యాల‌యం వ‌స్తువులు, ఫైళ్లు ఫ‌ర్నీచ‌ర్ మాత్రం అక్క‌డికి మార్చే ప‌రిస్థితి లేకుండా పోయింది. కార‌ణం ఇప్ప‌టి వ‌ర‌కూ అద్దెకున్న భ‌వ నానికి ప్ర‌భుత్వం అద్దె క‌ట్ట‌లేద‌ట‌!  మ‌రి అద్దె క‌ట్ట‌కుంటే య‌జ‌మాని కాగితం క‌ద‌ల‌నిస్తాడా?  మ‌రి ప్ర‌భు త్వం ఈ  సాధార‌ణ నియమాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డ‌మేమిటి? 

పాముల‌పాడులో ఎమ్మార్వో కార్యాల‌యం వున్న భ‌వ‌నానికి ఇంత‌వ‌ర‌కూ అద్దే చెల్లించ‌లేద‌ట‌. ప్ర‌భుత్వం ఏర్పాట‌యిన సుమారు నాలుగేళ్ల నుంచి ఆ భ‌వ‌నానికి అద్దెగా ఒక్క పైసా ఇవ్వ‌లేద‌ని భ‌వ‌నం య‌జ‌మాని ప్ర‌శాంత్ ఆరోపిస్తున్నాడు. ఆయ‌న‌కు రూ.3,65,868 రూపాయ‌లు చెల్లించాలి. ఆ మొత్తం చెల్లిస్తేనే ఇక్కడ నుంచి వ‌స్తువులు బ‌య‌టికి వెళ‌తాయ‌ని తెగేసి చెప్పేడు. అంతేకాదు భ‌వ‌నానికి ఏకంగా తాళం వేసేసేడు. ఈ ర‌హ‌స్య‌మేమీ తెలియ‌ని ప్ర‌జ‌లు ఎమ్మార్వో కార్యాల‌యానికి వెళ్లి అక్క‌డ తాళం వేసి వుండ‌డం చూసి ఖంగారు ప‌డ్డారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఇలాంటి కామెడీలు కూడా జ‌రుగుతున్నాయ‌న్న‌ది వారికి తెలియ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది!

By
en-us Political News

  
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.