ఏపీలో ఆట మొదలైంది.. కమల దళంలోకి  RRR?

Publish Date:Nov 17, 2021

Advertisement

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఏపీ పై సంధించిన ఆకర్షణ అస్త్రం పని చేయడం మొదలైంది... వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, బీజేపీలో చేరేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. రఘురామ ఈ సంవత్సరం చివర్లో వైసీపీకి, పార్లమెంట్ సభ్యత్వాని రాజీనామా చేసి, డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి రోజున బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ తర్వాత నెస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు  జరిగే  ఉపఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాల ద్వారాతెలుస్తోంది. నిజానికి, అమిత్ షా ఏపీ పర్యటనకు ముందే, ఆయన అభిమానులు  ‘ట్రిపుల్  ఆర్’గా పిలుచుకుంటున్న రఘురామ కృష్ణంరాజు, పార్టీ ఎంట్రీకి సంబందించిన స్కెచ్ సిద్దమైందని తెలుస్తోంది. గతంలో చాలా కాలం క్రితమే ఆయన బీజేపీలో చేరేందుకు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా వద్ద సంసిద్ధతను వ్యక్త పరిచారు. అయితే, అప్పట్లో ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు అడ్డుపుల్లలు వేయడంతో ఆ ప్రయత్నం అప్పట్లో ఆగిపోయిందని పార్టీ వర్గాల సమాచారం.  

నిజానికి, రఘురామ కృష్ణం రాజు వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిననాటి నుంచి కమల దళంతో,కాషాయ కూటమి,సంఘ్ పరివార్’తో రాసుకు పూసుకు తిరుగుతున్నారు.బీజేపీ నాయకులనే కాకుండా ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో అనేక సందర్భాలలతో సమావేసమయ్యారు అలాగే,అనేక సందర్భాలలో బీజేపీ హిందుత్వ ఎజెండాను తమనోటితో వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం మత వివక్షకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి వెంకన్న స్వామి ఆస్తుల విక్రయానికి టీటీడీ చేసిన తీర్మానాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతోనే రెబెల్ ఎంపీ రాజు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు.  రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగతున్న మత ప్రచారం, మత మార్పిడులకు సంబంధించి, ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందజేశారు. 

అదలా ఉంటే ఇంచుమించుగా ఒక సంవత్సరానికి పైగానే, ఆయన ప్రతి రోజు రచ్చబండలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. చురకలు అంటిస్తున్నారు. వాతలు పెడుతున్నారు. చివరకు దమ్ముంటే, తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించాలని, జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. వైసీపీ కూడా, ఆయన్ని అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్’కు విజ్ఞప్తి చేసింది. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం రఘురామ పై కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. బైలు రాకుండా అడ్డుకుంది. అంతే కాదు, జైలులో  చిత్ర హింసలకు గురిచేసిందని ఆయన కోర్టులో కేసు వేశారు.ఇలా జగన్ రెడ్డిపై ఓ వంక రాజకీయ పోరాటం, మరో వంక న్యాయపోరాటం చేస్తున్నారు.మొత్తానికి వార్తల్లో ఎంపీ గా అందరి నోళ్ళలో నలుగుతున్నారు. జగన్ రెడ్డికి పంతికిండి రాయిలా, కంట్లో నలుసులా ఇబ్బంది పెడుతున్నారు. 

ఇక ఇప్పుడు, స్వయంగా అమిత్ షా ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళను పార్టీలోకి తెచ్చుకుని వారికి సముచిత స్థానం కలిపించాలని, ఆ విధంగా రాష్ట్రంలో బీజేపీని, 2024 ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బలోపేతంచేయాలని రాష్ట్ర నాయకులకు క్లాసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో.. అందుకు తొలి అడుగుగా ‘ట్రిపుల్ ఆర్’తో అమిత్ షానే శ్రీకారం చుట్టారని అంటున్నారు.
అయితే, రఘురామ రాకతోనే, రాష్ట్రంలో బీజేపీ రెండు బలమైన ప్రాతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలను ఎదిరించి అధికారం అందుకోగలుగుతుందా, అంటే అది అంత ఈజీ వ్యవహారం కాదని అంటున్నారు పరిశీలకులు.

అదెలాగున్నప్పటికీ, బీజేపీ, ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల ముందుగానే ఏపీ మీద దృష్టి పెట్టింది. అలాగే, పొరుగు తెలుగు రాష్రం తెలంగాణలోనూ కమల దళం కదులుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో బెంగాల్ ఫార్ములా అమలు చేసేందుకు బీజేపీ సిద్ధమైందని అంటున్నారు. మొతానికి ఏపీలో షా ఆట మొదలైంది.. కొత్త రాజకీయం మొదలైంది. ఇక ఇది ఏ మలుపు తిరుగుతుంది. ఎక్కడకు పోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.