ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు : టీపీసీసీ చీఫ్
Publish Date:May 30, 2025
Advertisement
మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు, ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈటెల బీజేపీలో ఉన్నారా? బీఆర్‌ఎస్‌లో ఉన్నారా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారని ఆయన అన్నారు. దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే బండి సంజయ్‌ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలిగించారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భయపడే భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపేశారాని మహేష్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణాన్ని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధనం చెప్పాలని ఆయన తెలిపారు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని పీసీసీ చీఫ్ వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/mp-etela-rajender-39-199002.html





