పార్టీలు మారడం బట్టలు మార్చినంత సులువు కాదు : ఈటల రాజేందర్

Publish Date:Apr 5, 2026

Advertisement

 

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పంపించి ఐదేళ్లు పూర్తయ్యాయని గుర్తు చేస్తూ, అప్పటి నుంచి తాను భారతీయ జనతా పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నారంటూ పోస్టర్లు వేయడం అవాస్తవమని తెలిపారు.

పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదని, పార్టీ మారకూడదనే సందేశం తానే ఇచ్చానన్నారు. తెలంగాణ సమాజానికి తన గురించి పూర్తిగా తెలుసని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తనను బీఆర్‌ఎస్ నుంచి తొలగించడం తప్పు అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలిపారు. తనను బర్తరఫ్ చేయడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కోళ్ల ఫారాలు కూల్చడం, లీగల్‌గా కొనుకున్న భూములను కూడా సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు. సీఎం‌కు లేఖ రాస్తానని, సరైన సమయం వచ్చినప్పుడు తన స్థానం ఏమిటో తెలుస్తుందని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాను మేనేజ్ చేస్తోందని, ప్రజలను దబాయిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారని, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు. మొదటి కార్యక్రమంగా బాలాజీ నగర్‌లో “చలో” కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే ఎన్నికల కోసం సర్వేలు చేస్తున్నామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని, వ్యక్తిగత అభిమానం ఆధారంగా నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. 

తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించి మంత్రిపదవి ఆఫర్ చేశారని వెల్లడించారు. అలాగే మంత్రులు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, జి. వివేక్ వెంకటస్వామి వంటి నేతలతో కలిసి కాంగ్రెస్‌లో చేరితే మంత్రి లేదా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉండేదని అన్నారు. కానీ పదవుల కోసం రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. అబద్ధాల పునాదులపై రేవంత్ రెడ్డి గెలిచారని, అదే విధంగా పాలన కొనసాగుతోందని విమర్శించారు.

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని గుర్తుచేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజలు పిలిస్తే వెళ్లి నాయకత్వం వహిస్తానన్నారు. గత ప్రభుత్వంలో దోచుకున్నది కక్కిస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ఈటల ప్రశ్నించారు. చివరగా ప్రజల్ని, ధర్మాన్ని నమ్ముకున్నానని, సోషల్ మీడియాను కాదు అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
 

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.