పేర్నికి బాలశౌరి ఝలక్? .. నాని మౌనానికి కారణమదేనా?
Publish Date:Jun 19, 2022
Advertisement
మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని.. స్వపక్షంలోనే విపక్షంగా తయారైన ఎమ్మెల్యే పేర్ని నానికి ఝలక్ ఇచ్చారని బందరు వైసీపీ శ్రేణుల్లో ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల బందరులో ఎంపీ బాలశౌరి పర్యటన.. ఈ సందర్భంగా పేర్ని నాని ప్రధాన అనుచరుడి హంగామా ఎపిసోడ్‌ని వైసీపీ హైకమాండ్ చాలా సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. ఆ క్రమంలో ఈ పంచాయతీపై పేర్ని నాని.. పార్టీలో కీలక నేతలకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా... వారు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.మాకంతా తెలుసు మీరు చెప్పాల్సిందీ, చెప్పుకోవలసిందీ ఏమీ లేదంటూ నానిని నోరెత్తనీయలేదని పార్టీ శ్రేణులో అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి. అయితే బందరులో తన పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియోను..వైసీపీ పెద్దలకు ఎంపీ బాలశౌరి చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా.. మంత్రిగా ఉండగా.. పేర్ని నాని అవినీతికి జాబితాను సైతం బాలశౌరి వైసీపీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ సహా, పార్టీలోని కీలక నేతలకు ఇంత కాలం పేర్ని నానిపై ఉన్న సానుకూలత ఆవిరైపోయిందని అంటున్నారు. ఆ కారణంగానే ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్గంలో జోష్ పెరిగిందని అంటున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి పర్యటన సందర్భంగా సంభవించిన పరిణామాలన్నీ కూడా పేర్ని నాని ఆయన అనుచరవర్గం వల్లేననీ, జగన్ కు అవగతమయ్యేలా వివరించడంలో ఎంపీ విజయవంతం అయ్యారన్న టాక్ వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోవల్లభనేని బాలశౌరికి ఉన్న అనుబంధం, సీఎం జగన్ తో ఉన్న వ్యాపార సంబంధం కూడా వైసీపీ హైకమాండ్ కు పేర్ని నాని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి.. బందరు పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను,ఈ మూడేళ్లలో జరిగిన పలు అంశాలను సీఎం జగన్‌కు ఉదాహరణలతో సహా వివరించారని అంటున్నారు. మంత్రి పదవి పోయిన తరువాత పేర్ని నాని అనుచరగణంలోని పలువురు బాలశౌరి పంచన చేరి, మాజీ మంత్రిగారి లొసుగులను అక్కడ చేరవేయడం వల్లే నాని బలహీన పడ్డారనీ, అధిష్ఠానం వద్ద పలుచన అయ్యారనీ కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సైలంట్ గా ఉండటమే మంచిదని పేర్ని పట్ల అంతో ఇంతో సానుకూలత ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆయనకు సూచించారని అంటున్నారు. అందుకే పేర్ని నాని, ఆయన అనుచరగణం ప్రస్తుతం మౌనం వహించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/mp-balasouri-shock-to-perni-nani-25-137995.html