పెళ్ళికి వెళ్లారు.. రూ. వేయి ఫైన్ కట్టారు..
Publish Date:Jun 1, 2021
Advertisement
2020 సంవత్సరం కంటే ముందు. పెళ్లి అంటే తెలుగు సినిమా డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమాల ఉండేది. పెళ్లి కూతురు వైపు బంధువులు, పెళ్లి కొడుకు వైపు బంధువులు, ఊర్లో వాళ్ళు, ఫ్రెండ్స్, ఒక వైపు బాజాభజంత్రీలు, మరోవైపు సన్నాయి సప్పుళ్ళు, ఇంకో వైపు బాహ్మణుడి వేద మంత్రాలు. అబ్బో ఆడో పెద్ద పండగల ఉండేది. ఎప్పుడైతే కరోనా ప్రపంచం నట్టింట విలయతాండవం చేయడం మొదలు పెట్టిందో. అప్పటి నుండి పెళ్లి కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే నమ్మాల్సిందే. కరోనా సమయంలో ప్రభుత్వాలు అన్నింటికీ నిబంధనలు విధించినట్లే పెళ్లి వేడుకల మీద కూడా విధించింది. కొంత మంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు అమ్మానాన్నల పర్మిషన్ తీసుకోకుండా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ఇంట్లో శుభకార్యం చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకుని నిబంధనలు కచ్చితంగా పాటించి తీరాల్సిందే. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. ఇటీవల చాలామంది ఆ నిబంధనలు అతిక్రమించి చిక్కుల్లో పడిన ఘటనలు చూస్తేనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళంలో ఓ టీచర్ పెళ్లి వేడుకకు ఏకంగా 250 మంది హాజరు కావడంతో పోలీసులు పెళ్లి కొడుక్కి రూ.2లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జిల్లాలో మరో వివాహ వేడుకకు హాజరైన వారికి దిమ్మతిరిగే షాకిచ్చారు పోలీసులు. వీడి పెళ్లి మా సావుకు వచ్చింది అనే సామెత వినేవుంటారు. కానీ తాజాగా ఒక వ్యక్తి వివాహ వేడుక 250 మంది అతిధులకు ఫైన్ పడింది. అది శ్రీకాకుళం జిల్లా. భామిని మండలం. తాలాడ గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన వివాహ వేడుక రిసెప్షన్ జరిపించుకున్నాడు. తన బంధువులకి, మిత్రులకి, ఊర్లో వాళ్ళకి, తన శ్రేయోభిలాషులకు అందరికి శుభలేఖలు ఇచ్చారు. కరోనా సమయంలో ప్రభుత్వ నిభందనలు పెట్టిన విషయం తెలిసిందే.. ఆ నిబంధలను కాలరాస్తూ, పరిమితికి మించి అతిథులు హాజరయ్యారు. హాజరు అయ్యారు పోనీ.. ఆ హాజరు అయినా వాళ్ళు కనీసం మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా జాతరలో తిరిగినట్లు తిరుగుతూ ఫంక్షన్లో సందడి చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిమితికి మించి ఎక్కువ మంది అతిథులు హాజరుకావడం, ఒక్కరు కూడా మాస్కలు ధరించకపోవడాన్ని నిర్ధారించుకున్న పోలీసులు అందరినీ మందలించారు. నిబంధనలు అతిక్రమించిన నేరానికి పెళ్లి కొడుకు, పెళ్లికూతురు సహా ఫంక్షన్ హాజరైన ప్రతి ఒక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే పెళ్లి వారి కుటుంబానికి జరిమానా విధించాలి గానీ.. అతిథులకు కూడా ఫైన్ వేస్తారా? అంటూ కొందరు పోలీసులకు వాగ్వాదానికి దిగారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతి ఒక్కరూ జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పిన పోలీసులు 30 మంది దగ్గర రూ.వెయ్యి చొప్పున జరిమానా వసూలు చేసుకుని స్టేషన్‌కు వెళ్లిపోయారు.
http://www.teluguone.com/news/content/-25-116753.html





