అప్పుడు ఓడి గెలిచింది.. ఇప్పుడు గెలిచి ఓడింది

Publish Date:Jun 2, 2025

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తయ్యాయి. పుష్కర సంవత్సరంలోకి అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం స్వతస్సిద్దంగా ఏర్పడిన రాష్ట్రం  కాదు.. పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అందుకే తెలంగాణ గడ్డ  పోరాటాల పురిటి గడ్డ అంటారు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర సాధన..  తెలంగాణ రాష్ట్ర సమితి సారధ్యంలో 2001 నుంచి 2014 వరకు సాగిన మలి దశ ఉద్యమం ద్వారానే సాధ్యమైనా..  తెలంగాణ ఉద్యమం  ఆరు పదులకు పైగా సాగిన ఒక దీర్ఘకాలిక, రాజకీయ ప్రజా ఉద్యమం. 

నిజానికి..  1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పురుడు పోసుకుంది. ఇక అక్కడినుంచి 60 ఏళ్ల పాటు  ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూనే వుంది.  ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎందరో నాయకుల సారధ్యంలో పార్టీలు పుట్టుకొచ్చాయి. కారణాలు ఏవైనా..  మధ్యలోనే లక్ష్యం పక్కదారి పట్టి పోయింది. అయితే నాయకుల స్వార్ధంతో ఉద్యమం పక్కదారి పట్టినా..  ఉద్యమ స్పూర్తి మాత్రం సజీంగానే నిలిచింది. 

అందుకే.. జాతీయ, రాష్ట్ర నాయకులు మోసాలు చేసినా..  పడిలేచిన కెరటంలా  తెలంగాణ ఉద్యమం అంతిమ గమ్యాన్ని చేరుకుంది. 1969లో విద్యార్ధుల సారథ్యంలో మహోదృతంగా ఎగసి పడిన జై తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగ ప్రవేశంతో పది నెలలకే చల్లబడింది. సర్కార్ తూటాలకు వందల మంది విద్యార్ధుల నేలకొరిగారు. అయినా..  విద్యార్ధుల బలిదాన స్పూర్తి నిలిచింది. 2001లో మలిదశ ఉద్యమం పురుడు పోసుకునే వరకు  ప్రత్యేక తెలంగాణ స్పూర్తి సజీవంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం కోసం  సబ్బండ వర్గాల ప్రజలే నడుం బిగించారు.  ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్య స్పూర్తిని  కొనసాగించారు. 

ఇక ఆ తర్వాత ఏమి జరిగిందీ అన్నది మన ముందున్న నడుస్తున్న చరిత్ర.  ఇప్పడు 2001లో కల్వకుట్ల చంద్రశేఖర రావు  సారథ్యంలో గులాబీ జెండా నీడలో..  2001లో మలిదశ ఉద్యమం మొదలైంది. తొలితరం ఉద్యమ నేత  కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశీస్సులతో 2001 ఏప్రిల్, 27న జలదృశ్యంలో మలిదశ ఉద్యమం తొలి అడుగు వేసింది. అయితే..  గమ్యం చేరుతుందని.. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యంవుతుందన్న  ఆశ అప్పటికి అంతగా లేక పోయినా.. 2014  జూన్ 2 న ఆరు పదుల కల నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 

అయితే..  అంతవరకు ఏమి జరిగింది, ఆ తర్వాత ఏమి జరిగింది, ఇప్పడు ఏమి జరుగుతోంది..  అనే విషయంలోకి వస్తే, ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సకల జనుల సమ్మె(2008) వంటి మహోన్నత ఆందోళనలు,1200 మందికి పైగా తెలంగాణ బిడ్డల బలిదానంతో సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఆకాంక్ష అయితే నెరవేరింది  కానీ.. కొండాలక్ష్మణ్ బాపూజీ ,  కాళోజీ నారాయణ రావు,  ప్రొఫెసర్ జయశంకర్ సార్,  కేశవ రావు జాదవ్ వంటి  తెలంగాణ సిద్దాంత కర్తలు, స్పూర్తి ప్రదాతలు, ప్రాతః స్మరణీయుల కన్న కలలు ఫలించాయా..  ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ ఆకాంక్షను ఉపిరిగా జీవించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా.. అందుకోసమే ఉపిరి వదిలిన వందల మంది అమర వీరుల ఆకాంక్షలు నేరవేరాయా? అంటే మాత్రం తెలంగాణ ప్రజనీకం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడింది  కానీ, ఆకాంక్షలు మాత్రం అలాగే ఉన్నాయి. అన్నదే  తెలంగాణ ప్రజలు ఇచ్చే సమాధానం అవుతుందని  అంటున్నారు. 

నిజానికి..  ఈరోజున్న వాస్తవ పరిస్థితులను, రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వికృత విన్యాసాలను  గమనిస్తే..  ముఖ్యంగా.. తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకుని   బీఆర్ఎస్ గా  పేరు మార్చుకున్న టీఆర్ఎస్ లో, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర తొలి, మలి ముఖ్యమంత్రి, ప్రస్తు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  1969 నాటి, తెలంగాణ తొలిదశ ఉద్యమం ఓడి గెలిస్తే.. 2001 మొదలైన మలి దశ ఉద్యమం గెలిచి ఓడిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవంక  రాష్ట్ర గీతం.. రాష్ట్ర మాత(తెలంగాణ తల్లి) విగ్రహం కూడా రాజకీయ రంగులు పులుముకున్న పరిస్థితిలో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే మూగ బాధ జనంలో వ్యక్తమవుతోంది. చివరకు, మరో ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నతెలంగాణ నడుస్తున్న చరిత్రను గమనిస్తే.. ‘తన చరిత్రను తనే పఠించి ఫక్కున  నవ్వింది ధరిత్రి’  అన్న కవి వాక్కును  తెలంగాణ రాజకీయ నాయకత్వం నిజం చేస్తోందని, అంటున్నారు.

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక వ్యాసం 

By
en-us Political News

  
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా?
వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు. కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నంబర్ 11 తో నెటిజనులు మరో సారి వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. 11 నుంచి ప్రారంభయమ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ 11 మందీ హాజరౌతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పురాణం విప్పారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్లపాటు సమర్థవంతంగా నడిపించడం, స్థిరమైన, నిలకడైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించడం ఆమె పరిణితికి నిదర్శనంగా ప్రధాని అభివర్ణించారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.
అజిత్ పవార్ మృతితో విలీనానికి బ్రేక్ పడిందన్నారు. ఇక పోతే అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శనివారం (జనవరి 31) ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న సంగతి తనకు తెలియదన్న శరద్ పవార్, అసలు ఎన్సీపీ (అజిత్ పవార్)లో ఏం జరుగుతోందన్న విషయం తనకు తెలియదన్నారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ ఆరు నెలలలోగా రాజీనామా చేసి బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆమె స్థానంలో అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభ సభ్యురాలైన సుచిత్రా పవార్ నియమకాన్ని ఖరారు చేసేందుకు ఎన్సీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. శనివారం మధ్యాహ్నం ముంబైలోని విధాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో సునేత్రాపవార్ ను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
దేశంలోనే అతి పెద్ద అవినీతి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించగా, ప్రజల ధనం, ఆరోగ్యంతో ఆటలాడిన ఈ కుంభకోణంలో నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవ్వడం కంటే దారుణం మరొకటి ఉండదని, అధిక ధరలకు చౌకబారు మద్యం అమ్మారనీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేననీ, సిట్ విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని ఆయన కోరారు. కాగా కేసీఆర్ అభ్యర్థనకు సిట్ అంగీకరించింది. ఫొన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కు మరింత సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.