నారా లోకేశ్ పాదయాత్ర@ 200 డేస్.. అమ్మ దీవెన

Publish Date:Aug 31, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. గురువారం (ఆగస్ట్ 31)తో  రెండు వందల రోజులు పూర్తి చేసుకోనుంది. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర.. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే గురువారం లోకేశ్ పాదయాత్రలో తమ కుటుంబ సభ్యులు పాల్గొంటారని ఆయన తల్లి నారా భువనేశ్వరి  తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలో నూతన హెరిటేజ్ పార్లర్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె తొలి సారిగా నారా లోకేష్ పాదయాత్రపై స్పందించారు. భగవంతుడు లోకేశ్‌కు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. లోకేశ్ ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు. ప్రజాస్వామంలో  స్వేచ్చగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి  ప్రజల తరఫున లోకేశ్ పాదయాత్ర చేపట్టారని వివరించారు.  

ఈ ఏడాది జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి నారా లోకేశ్.. యువగళం   పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలా ప్రారంభమైన నారా లోకేశ్ పాదయాత్ర.. రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మీదుగా  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.  

 ఆయన పాదయాత్ర  దాదాపు  మూడు వేల కిలోమీటర్ల మైలురాక చేరువ అవుతోంది. లోకేశ్ తాను చేపట్టిన పాదయాత్రలో ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలు.. అలాగే యువతకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.  ఇంకో వైపు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మొత్తం 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనున్న సంగతి  తెలిసిందే.  
    
ఇంకోవైపు లోకేశ్ పాదయాత్రపై ఆయన తల్లి నారా భూవనేశ్వరి మంగళవారం అంటే ఆగస్ట్ 29వ తేదీన తొలిసారిగా కుప్పంలో  స్పందించారు. నారా లోకేశ్ పాదయాత్ర చూసి తాను ఓ తల్లిగా చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తొలుత నారా లోకేశ్ పాదయాత్ర  చేస్తానన్నప్పుడు తనకు భయం వేసిందని..    వద్దని వారించాననీ అన్నారు.  ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని..  తనను ఆపవద్దనీ లోకేశ్ తనతో అన్నారన్నారు. అంతే ఆ తరువాత తాను ఎప్పుడూ తన బిడ్డను వారించలేదని భువనేశ్వరి వివరించారు.   ప్రజలకు   ఏదో చేయాలనే తపన లోకేష్ లో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం లోకేష్ నిలబడుతున్నారనీ, పార్టీలో కేడర్, ప్రజలు చాలా అవస్థలు పడ్డారని... వాళ్ల గురించి ఆలోచిస్తే.. లోకేశ్ చేసిందేమీ లేదన్నారు. వాళ్ల కోసం వాళ్ల హక్కుల కోసం.. వారి స్వేచ్ఛ కోసం.. లోకేశ్  కష్టపడాలన్నారు. లోకేశ్ ఇప్పటి వరకు.. ఏ నాడు ఈ పాదయాత్రలో అనారోగ్య సమస్యల గురించి తనకు చెప్పిందే లేదన్న భువనేశ్వరి తన బిడ్డ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తారనీ, దేవుడి దీవెనలు లోకేష్ కు పుష్కలంగా ఉన్నాయన్నారు. తల్లిగా తన దీవెనలు ఎప్పుడూ లోకేష్ కు ఉంటాయని చెప్పారు.  

అధికార పార్టీ వల్ల తమ కుటుంబం సమస్యలు ఎదుర్కొందనీ.. అలా ఎదుర్కోవడం తమ కుటుంబానికి అలవాటైపోయిందనీ అన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా  పోరాడి.. విజయంతో బయటకు వస్తామని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. అయితే తన తండ్రి ఎన్టీఆర్ 100 రూపాయిల నాణెం విడుదల చేయించాలనే ఓ ఆలోచన తన సోదరి పురంధేశ్వరికి వచ్చిందన్న భువనేశ్వరి ఆమెకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కూడా డిసెంబర్ నాటికి పూర్తవుతుందని.. స్థానికంగా ఇల్లు ఉండడం వల్ల ప్రజలకు మరింత దగ్గరాగా ఉంటామని  వివరించారు. కుప్పంలో మళ్లీ చంద్రబాబు మంచి మెజార్టీతో  గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ వారు  తనపై చేసిన వ్యాఖ్యల నుంచి బయటకు రావడానికి తనకు నెలరోజులు పట్టిందని.... ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా, అండగా నిలిచారని చెప్పారు.  ఇక ఎవరు ఎన్ని అన్నా లెక్క లేదన్నారు. ఒకసారి ఎదుర్కొన్నాం.. ఇంకా పదిసార్లు అయినా ఎదుర్కొంటామన్నారు. 2024లో తప్పకుండా.. తెలుగుదేశంఅధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి విశ్వాసం వ్యక్తం చేశారు. 

తన భర్త చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజలు.. ఏడు సార్లు గెలిపించారని... ఆ నియోజకవర్గ ప్రజల రుణం తాము తీర్చుకోలేనిదన్నారు. అలాగే వారు చూపించే అభిమానం ఈ జన్మలో మరిచిపోలేమని చెప్పారు. అందుకు ప్రతీగా వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంజివీని ఆరోగ్య క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని ద్వారా పేద వారందరికి ఆరోగ్యం అందుతోందని ఆమె ఆకాంక్షించారు. సంజివీని క్లినిక్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఓ బస్సు ఏర్పాటు చేస్తామని.. ఈ బస్సు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తుందన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో.. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఈ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు నారా భువనేశ్వరి వివరించారు. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చేసేందుకు కృషి చేస్తామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.