యాంటీ ఇంకంబెన్సీయే కాదు.. అంతకు మించి!

Publish Date:Oct 7, 2024

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ పై దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో సందేహానికి తావు లేకుండా రుజువు చేశాయి. మోడీ సర్కార్ కు అంటే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ప్రజలు పూర్తిగా అంగీకరించలేకపోయారన్నదానికీ ఈ ఎన్నికల ఫలితం నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే 2014, 2019 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ కు తిరుగులేని మెజారిటీ ఇచ్చి, కాంగ్రెస్ ను విపక్ష హోదా కోసమే ఇబ్బంది పడేలా తీర్పు ఇచ్చారు. అదే ప్రజలు 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ను బలమైన ప్రతిపక్షంగా ఎన్నుకున్నారు. అదే సమయంలో గతానికి భిన్నంగా మోడీ సర్కార్ మనుగడ కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి కల్పించారు. 

అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఒకటి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం కాగా, మరొకట హర్యానా. ముందుగా హర్యానా విషయానికి వస్తే.. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది.  అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి శరాఘాతం కానున్నాయని ఎగ్జిట్ పోల్స్ సందేహాలకు అతీతంగా వెల్లడించాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5న ఒకే విడతలో జరిగాయి. ఫలితాలు ఈ నెల 8న విడుదలౌతాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హర్యానాలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 55 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయన్నది ఎగ్జిట్ పోల్స్ ఫలితం. చెబుతోంది. అంటే సింపుల్ మెజారిటీ కంటే దాదాపు 10 స్థానాలు అధికంగా కాంగ్రెస్ గెలుచుకోనుంది.

ఇక పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 32 స్థానాలకు పరిమితమౌతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పదేళ్ల బీజేపీ పాలనకు ఎండ్ కార్డ్ పడినట్లే. అయితే ఈ సారి గమనించాల్సిన విషయమేంటంటే హర్యానాలో బీజేపీ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల పెల్లుబికిన ఆగ్రహం కూడా జనం ఈ స్థాయిలో స్పందించడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో మూడు దశలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 5, 25, అక్టోబర్ 1న మూడు విడతలుగా జరిగిన పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి జమ్మూ కాశ్మీర్ లో ప్రతికూల ఫలితం రావడం ఖాయమని తేలింది. అయితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. వాస్తవానికి 2018 నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రం పాలనలోనే ఉంది.   ఆర్టికర్ 370 రద్దు రాష్ట్రంలో తమకు భారీగా లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావించింది. అయితే ఫలితం అందుకు భిన్నంగా ఉండబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో సింపుల్ మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన 46 స్థానాలను అటు కాంగ్రెస్ కూటమి కానీ, ఇటు బీజేపీ కూటమి కానీ సాధించే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాలలోనూ బీజేపీకి ఎదురుదెబ్బతప్పదని తెలడంతో బీజేపీలో ఆందోళన వ్యక్తమౌతోంది. అసలే కేంద్రంలో ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మద్దతుతో నడుస్తున్న నేపథ్యంలో హర్యానా, జమ్మూ కాశ్మీర్ లలో  ఎగ్జిట్ పోల్స్ నిజమై ప్రతికూల ఫలితాలు వస్తే బీజేపీ చిక్కులు మరింత పెరుగుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.