తెలుగు రాష్ట్రాలలో హాల్ మార్క్ నిబంధనల పరిధిలోకి మరిన్ని జిల్లాలు

Publish Date:Sep 8, 2023

Advertisement

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం  కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ నిబంధనను అమలులోకి  తీసుకువచ్చింది. హాల్ మార్క్ ద్వారా బంగారు ఆభరణాల కొనుగోలు దారులు  స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  2021 జనవరి 15 నుంచి బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనను తప్పనిసరి అయినప్పటికీ ఈ నిబంధన ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలోనే అమలులో ఉంది.

తాజాగా దీనిని విస్తరించడంతో తెలంగాణలో కొత్తగా ఈ నిబంధన పరిధిలోకి మరో ఐదు జిల్లాలు చేరాయి.   ఇప్పటి వరకూ తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే హాల్ మార్క్ నిబధన పరిధిలో ఉండగా ఇప్పుడు   మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చింది. దీంతో తెలంగాణలో  12 జిల్లాలు బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చినట్లైంది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఈ నిబంధన పరిధిలో   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్రమే ఉండగా ఇప్పుడు  అన్నమయ్య ,కోనసీమ , ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలయాడ్ అయ్యాయి. దీంతో ఏపీలో హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చిన జిల్లాల సంఖ్య 17కు పెరిగింది. 

By
en-us Political News

  
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.