ఇక సోమవారం కాదు పోలవారం!

Publish Date:Jun 17, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం బహుళార్థ సాథక ప్రాజెక్టును జగన్ సర్కార్ పక్కన పెట్టేసింది. చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పడకేశాయి. రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ పోలవరం ప్రాజెక్టు పనుల వేగాన్ని గణనీయంగా తగ్గించేశారు. కనీస అవగాహన లేని అంబటి రాంబాబుకు జలవనరుల మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టిన జగన్ పోలవరంపై తనకు ఉన్న శ్రద్ధ ఏమిటో చెప్పకనే చెప్పేశారు. 

జగన్ అరాచకపాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు ద్వారా చరమగీతం పాడేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో పోలవరం పనులు ఇక జోరందుకుంటాయన్న ఆశ సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో గతంలో చంద్రబాబో పోలవరం ప్రాజెక్టు పనులను  తరచుగా పర్యవేక్షించి ఆ పనులను పరుగులెత్తించిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వారం వారం పోలవరం సందర్శనకు ప్రత్యేక సమయం కేటాయించే వారు.

వారం ఆరంభంలోనే ఆయన పోలవరం సదర్శనకు రావడంతో ఆయన పర్యటన ఫలితంగా వారం అంతా పనులు జోరుగా సాగేవి. నిర్దేశించిన గడువు మేరకు నిర్దేశిస పనులు పూర్తయ్యేలా ఆయన తరచూ చేసే సమీక్షలు పోలవరం వేగం పుంజుకోవడానికి దోహదపడ్డారు. ఆయన హయంలో సోమవారం పోలవారంగా మారిపోయింది. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పేవారు. తనకు సోమవారం లేదనీ, అది పోలవారమని చంద్రబాబు చమత్కరించేవారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మొత్తం మొత్తం 83 సార్లు పోలవరం పనులను సమీక్షించారు. అంతే కాదు పోలవరం పూర్తికి అత్యంత కీలకమైన ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయ్యే వరకూ తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేది లేదని భీష్మించి మరీ అనుకున్నది సాధించారు. 
అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయంపాలై వైసీపీ అధికారలోకి వచ్చి జగన్ సీఎం కావడంతో పోలవరం పనులు ముందుకు సాగలేదు. అవగాహనా లోపం,  ప్రాధామ్యాలు మారిపోవడంతో జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, పురోగతి కంటే బటన్ నొక్కుడు సంక్షేమంపైనే జగన్ దృష్టి పెట్టారు. దీంతో పోలవరం పనులు కుంటుపడ్డాయి. దీనిపై రైతులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది.

జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తిపై జగన్ దృష్టి పెట్టక పోవడాన్ని రైలులే కాదు సామాన్య జనం కూడా తప్పుపట్టారు. సరే ఇప్పుడు జగన్ ప్రభుత్వం గద్దెదిగి చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో పోలవరం పరుగులు పెడుతుందనీ, ఆంధ్రప్రదేశ్ నీటి కొరతే లేని రాష్ట్రంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదనీ ప్రజలు భావిస్తున్నారు. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.