అమరావతి 2.0 ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ!

Publish Date:Mar 12, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2015లో భారీ స్థాయిలో శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజయర్యారు. ఆ సందర్భంగా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో అమరావతి దేశానికే ఆదర్శవంతమైన నగరంగా, ఢిల్లీని మించిన రాజథానిగా రూపు దాలుస్తుందని ఆకాంక్షించారు. అయితే ఆ తరువాత పరిస్థితులు తారుమారైపోయాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టారు. అక్కడ నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిరంతర దాడులు, అణచివేతను ఎదుర్కొంది. రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. రాజధానికి భూములిచ్చిన రైతులను జగన్ సర్కార్ నానా రకాలుగా వేధించింది. అక్రమ కేసులు బనాయించింది. అర్ధరాత్రి పోరాట శిబిరాలపై, రైతుల నివాసాలపై దాడులు చేయించింది. 

జగన్ ఐదేళ్ల అరాజకపాలనకు ఆంధ్రా జనం 2024 ఎన్నికలలో చరమగీతం పాడారు. ఓటుతో జగన్, ఆయన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా అర్హత కూడా లేదని విస్పష్ట తీర్పు ఇచ్చారు. 2024 ఎన్నికలలో నభూతో నభవిష్యత్ అన్నరీతిలో అమోఘ విజయం సాధించిన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. అమరావతికి మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చి నిర్దుష్ట కాల వ్యవధిలో  పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే త్వరలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.  

ఈ పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారని విశ్వసనీయంగా తెలిసింది.  పదేళ్ల కిందట అంటే 2015లో అమరావతి శంకుస్థాపనకు హాజరైన మోడీ.. ఇప్పుడు దశాబ్దం తరువాత అదే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరు కానుండటం విశేషం.  

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.