ప్రధాని చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. ఎప్పుడంటే..?

Publish Date:Jul 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగానికి  కీలకమైన విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది.  ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ఏర్పాట్లలో నిమన్నమయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ..  భోగాపురం  గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని రికార్డు వేగంతో  పూర్తి అయ్యింది.

ఇక గత కొన్ని వారాలుగా, ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.  

ప్రధాని  రాక సందర్భంగా..  భోగాపురం సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.   60 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నంచీ పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో..  ట్రాఫిక్, శాంతి భద్రతలకు సంబంధించి పటిష్టమైన ప్రణాళికతో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  మూడు వేలకు పైగా వాహనాలకు సరిపోయేలా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. భారీ వర్షాలు కురిసినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల పునర్నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థల పటిష్టతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

మోడీ పర్యటన, సభ కోసం..  రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీలు స్వయంగా భోగాపురం సభా ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా..  నిబంధనలకు అనుగుణంగా భద్రతను నాలుగు  సెక్టార్లుగా  విభజించారు. శాంతిభద్రతల పరిరక్షణ, జనసమూహాల నిర్వహణ, ప్రొటోకాల్ అమలులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా  విస్తృత  చర్యలు చేపట్టారు.  విఐపీల రాకపోకలు, ప్రజల రాకకు వేర్వేరు మార్గాలను కేటాయించి రవాణా మార్గాలను సుగమం చేస్తున్నారు. 

Prime Minister Narendra Modi,  visit to Andhra Pradesh,  CM Chandrababu Naidu, Development of North Andhra, Bhogapuram Greenfield Airport 

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన శాంతియుత నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం మెట్లుక్కింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మరియు జాతీయ పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న వరుస అక్రమాలు, అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు పోరాటబాట పట్టాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం..!
10 ఏళ్లలో 152 లీకేజీలు..రాహుల్ సంచలన ఆరోపణలు..!
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక ఎక్స్ (X) వేదికగా తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన తాజా ఊరటపై స్పందించారు.
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురై ఎడమ మోకాలికి గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సహజ వనరుల నిర్వహణ, ముఖ్యంగా ఇసుక విధానం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయంగా కాకుండా ప్రభుత్వాల భవిష్యత్తును తేల్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
నరేంద్ర, ధర్మెంద్ర ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నారు..!
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చించేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కోట్లాది మంది భక్తులు ఆరాధ్యదైవంగా పూజించే తిరుమల కొండకు వెళ్లే మార్గంలో ఆంజనేయ స్వామి విగ్రహం మాయమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తుల నమస్కారాలు, నిత్య ధూపదీప నైవేద్యాలు అందుకునే ఆలయంలోనే ఈ దొంగతనం జరగడం భక్తుల తిరుమలలో భద్రతా చర్యలలోని డొల్ల తనాన్ని బట్టబయలు చేసింది.
జమ్మూకాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని బయటపెట్టారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.