మోడీ తెలంగాణ పర్యటన.. ఈ సారైనా కేసీఆర్ పాల్గొంటారా?

Publish Date:Jul 6, 2023

Advertisement

ప్రధాని తెలంగాణ పర్యటన అనగానే ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలుకుతారా? అన్న అనుమానాలు రావడం సర్వసాధారణమైపోయింది. గత ఏడాదిన్నర కాలంగా ప్రధాని అధికారిక పర్యటనపై ఎప్పుడు తెలంగాణకు వచ్చినా  రాష్ట్రంలో ఉండకుండా దేశ వ్యాప్త పర్యటన అనో, అనారోగ్యమనో కేసీఆర్ ఆయనకు ఎదురుపడటం లేదు.  మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్యత కూడగట్టడంలో విఫలమైన కేసీఆర్ ఇప్పుడు మోడీపై, ఆయన సర్కార్ పై, అలాగే బీజేపీపై విమర్శల తీవ్రతను కనీస స్థాయికి తగ్గించారు.

అయినా శనివారం మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతారా అంటే పరిశీలకులు అనుమానమనే అంటున్నారు.   ప్రొటో కాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంటుంది.  అయితే కేసీఆర్ ప్రొటోకాల్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్ర గవర్నర్ విషయంలో బీఆర్ఎస్ నేతలూ, చివరాఖరకు అధికారులు కూడా ప్రొటో కాల్ పాటించడం లేదన్న విషయం తెలిసిందే.  గతంలో ఒక సారి తెలంగాణలో  హైదరాబాద్ లో ఇండియన్  స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ హైదరాబాద్ వచ్చారు.  ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి.ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది. అయినా కేసీఆర్ డుమ్మా  కొట్టారు.

అలా డుమ్మా కొట్టడానికి కారణం పీఎంవో నుంచి తనను ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ వచ్చిన సూచన అని చెప్పారు. అయితే దానిని పీఎంవో ఖండించడంతో  కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే మోడీకి ముఖం చాటేశారని అర్ధమైంది. అలాగే హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇంకా ఇక్రిశాట్ లో కార్యక్రమానికీ డుమ్మా కొట్టారు. 

అదే విధంగా గత ఏడాది నవంబర్ 12న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు.  రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సభకూ  కేసీఆర్ డుమ్మా కొట్టారు.  అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో కేసీఆర్ మోడీ లక్ష్యంగానే విమర్శలు గుప్పించారు. మీడియా మీట్ లలో కూడా మోడీనే నేరుగా నిలదీస్తూ విమర్శలు గుప్పించారు. యథావిథిగా అప్పుడు కూడా మోడీకి ఎదురు పడలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు గతంలోలా లేవు. ఇప్పుడు కేసీఆర్ ప్రధాని మోడీ సర్కార్, బీజేపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకూ కూడా ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.  అందుకే   ప్రధాని మోదీ శనివారం (జూలై 7) తెలంగాణ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీకి కేసీఆర్ ఆహ్వానం పలికితే.. బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని జనం భావిస్తారు.. కనుక కేసీఆర్ మోడీకి ఎదురేగి ఆహ్వానం పలికే అవకాశం లేదంటూ విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే మోడీ తెలంగాణ పర్యటన విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.  మోడీ పర్యటనలో భాగంగా కాజీపేటలో రైల్వేశాఖ ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు. ఇవి రెండూ కూడా అధికారిక కార్యక్రమాలు. ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు.

బీజేపీ విధానాలను   తీవ్రంగా వ్యతిరేకించే  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. అయితే కేసీఆర్ తీరు మాత్రం వేరే. అందుకే ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.