ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించారు. అమరావతి పున: నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదనీ అదోక శక్తి అని ఉద్ఘాటించారు.ఈ సందర్భంగా ఆయన 18 కీలక ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో. ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజక్టులూ ఉన్నాయి. ఉన్నాయి.
అమరావతి లో 58 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఏడు జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు. ఈ జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేస్తాయి. ఈ ప్రాజెక్టులలో జాతీయ రహదారులలోని వివిధ విభాగాల విస్తరణ, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు సబ్ వే నిర్మాణాలు ఉన్నాయి. రోడ్డు భద్రతను మరింత పెంచే లక్ష్యంతో వీటిని చేపడుతున్నారు. ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు సులువైన, తేలికైన, సజావైన ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.
అలాగే ఎలివేటెడ్ కారిడార్, హాఫ్ క్లోవర్ లీఫ్, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక రాజధాని అమరావతికి సంబంధించి... శాసనసభ, హైకోర్టు, సచివాలయం, పరిపాలనా భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం హస్తినకు బయలు దేరి వెళ్లారు. అలా వెళ్లగానే తన అమరావతి పర్యటనపై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తాను ఒక చారిత్రక అధ్యాయాన్ని ప్రారంభించాననీ, అందుకు ఎంతో ఆనందంగా ఉందనీ పేర్కొన్నారు.అమరావతి ఏపీ ప్రగతి పథాన్ని ముందుకు తీసుకువెడుతుందనీ, ఆది ఒక మహానగరంగా అవతరిస్తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి పట్ల, ప్రజల పట్ల చంద్రబాబు నిబద్ధత ప్రశంసనీయమని మోడీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదనీ, అదోక శక్తి అని అభివర్ణించారు. అలాగే అమరావతి నిర్మాణం పట్ల, ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు నిబద్ధత ప్రశంసనీయం అంటూ ఆ ట్వీట్ లో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-says-amarawathi-not-a-city-itis-pawer-39-197365.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.