జగన్ నెత్తిన మోడీ పాలు.. ఏకంగా 10,460. 87 కోట్లు ఇచ్చేశారు!

Publish Date:May 23, 2023

Advertisement

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. ఏం చేసినా మిమ్మల్ని ఆదుకోవడానికి కేంద్రంలో మేమున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి..  కొన్ని నెలలపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత భారీ ఊరట కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద రూ.10,460. 87 కోట్లు ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ  అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ నెల 19న ఆదేశాలిచ్చారు. నిధుల్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ రెవెన్యూ లోటు నిధుల కోసం 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్రం వ్యవహరించింది. అయితే  ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ.. జగన్ సర్కార్ కు అండగా, ఆర్థిక దన్నుగా కేంద్రం ఆ నిధులను విడుదల చేసింది.   రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా నిధులు విడుదలైనా అవి  విడతల వారీగా కేవలం పప్పు బెల్లాలకు తప్ప మరెందుకూ పనికి రాని విధంగా విడుదల చేసే శారు.  ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడమనేది అదీ ఆంధ్రప్రదేశ్ కు మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తొలి సారి. అదీ తన ఆర్థిక అరాచకత్వం కారణంగా ఏపీ పరిస్థితి దిక్కు తోచని స్థితిలో పడిన సమయంలో.. మోడీ సర్కార్ జగన్ పై అపార కరుణ చూపి.. కోరకుండానే  ఏకంగా పది వేల 460. 87 కోట్లు విడుదల చేసింది.  

రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూలోటు నిమిత్తం అందాల్సిన నిధుల కోసం అప్పటి  తెలుగుదేశం ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించింది. అయినా కొంత మొత్తాన్ని విదిల్చినట్లుగానే విడుదల చేసిన కేంద్రం.. మిగిలిన సొమ్ముకు కొర్రీలు వేసింది. 2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు, వనరుల భర్తీపై అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో.. 2014-15 సంవత్సర వనరుల అంతరానికి (గ్యాప్) సంబంధించి కేంద్ర బడ్జెట్లో పరిహారం చెల్లించాల్సి ఉంది.

దీని ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు రూ. 16.078 కోట్లు తేల్చారు. అందులో భాగంగా కేంద్రం 2014-15లో రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176.50 కోట్లు కలిపి మొత్తం రూ.3,979.50 కోట్లు ఇచ్చింది. ప్రామాణిక వ్యయం ఆధారంగా.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని 2016 సెప్టెంబరులో చెప్పింది. అయితే ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, మిగిలినదంతా కొత్త పథకాల కోసం ఖర్చు చేశారని 2017 మే నెలలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2018లోనూ కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రాష్ట్ర అధికారుల బృందం చర్చలు జరిపింది. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ.16,078.76 కోట్లుగా పరిగణించాలని కోరింది. నాటికి చెల్లించని (పెండింగ్) బిల్లులు పెద్దమొత్తంలో ఉన్నాయని వివరించింది. అయినా కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఒకటో తారీకు వస్తే చాలు.. ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి.. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు ఎలా.. ఇబ్బడిముబ్బడిగా ..ప్రకటించిన సంక్షేమ పథకాలకు నిధులు ఎలా తేవాలని .. సతమతమైయ్యే జగన్ ప్రభుత్వానికి ..కేంద్రం మంజూరు చేసిన నిధులు..ఎంతో ఊరటను ఇస్తాయి. నిధుల కోసం కాళ్లరిగేలా తిరిగిన చంద్రబాబును పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు ఇలా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడంపై రాజకీయ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో దత్తపుత్రుడు జగన్ ను ఆదుకునేందుకు మోడీ ఉదారంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

By
en-us Political News

  
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.