Publish Date:May 24, 2023
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ నిస్సహాయత, చేతకాని తనం ఆ దర్యాప్తు సంస్థ ప్రతిష్టనే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టనూ.. అంతకంటే ఎక్కువగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టనూ, ప్రధాని మోడీ ఇమేజ్ నూ కూడా దారుణంగా దెబ్బతీస్తున్నది. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ చేతకాని తనంతో వ్యవహరించడానికీ, నిస్సహాయంగా మిగిలిపోవడానికీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ జగన్ సర్కార్ కు ఇస్తున్న వత్తాసే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు.. ఆ దర్యాప్తు సంస్థపై జనానికి ఇంత కాలం ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
కేంద్ర సహకారం లేకపోతే, ఒక ఎంపి ఇంత అరెస్టు చేయడానికి అడుగుముందుకు వేయకుండా ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తుందా అన్న ప్రశ్న సామాన్య జనం నుంచే వస్తున్నది. నిజమే వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరు బీజేపీ ఇమేజ్ ను దేశ వ్యాప్తంగా డ్యామేజీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష సిసోడియాను రెండో ఆలోచన లేకుండా అరెస్టు చేయగలిగిన సీబీఐ.. కడప ఎంపీ విషయంలో ఎందుకు మీన మేషాలు లెక్కపెడుతోందన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తడబడుతోంది.
సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోం అంటూ గప్పాలు కొట్టి సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. ఈ విషయంలో బీజేపీ డైలాగులతో ప్రజలను నమ్మించడంలో విఫలమైందనే పరిశీలకులు అంటున్నారు. అవినాష్ కు సీబీఐ అరెస్టుకు మధ్య ఉన్నది కేంద్రంలోని మోడీ సర్కారేనని జనం నమ్ముతున్నారు. జయలలిత,శిబుసోరేన్, జగన్, గాలి జనార్దన్‌రెడ్డి వంటి అరెస్టు చేసిన సీబీఐ.. ఒక సాధారణ ఎంపీని అరెస్టు చేసేందుకు, ఒక జిల్లా ఎస్పీని బతిమిలాడుకున్న వైనం చూస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాళ్లూ చేతులూ కట్టేసిందెవరో తెలుసుకోవడానికి పెద్దగా పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారం లేకపోతే, అవినాష్ రెడ్డి ఇప్పటికే అరెస్టై మూడు నెలలు దాటి ఉండేదని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఎటూ స్టేక్ లేదు. బతిమలాడుకుంటే పొత్తలో భాగంగా ఒక వేళ ఉంటే గింటే.. ఒకటో రెండో ఎంపీ స్థానాలు, మూడో నాలుగో అసెంబ్లీ స్థానాలూ పోటీకి దక్కే అవకాశం ఉండొచ్చు. వాటిలో కూడా గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఏపీలో జగన్ ప్రభుత్వం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా, బీజేపీ మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-pride-dininish-in-avinash-episode-25-155838.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.