దీని భావ‌మేమి మోదీశా!

Publish Date:May 3, 2025

Advertisement

ఎంతో ఎదిగిపోయావుగా లోకేశా! 

ఈ ఫోటోను చూశారుగా.. మోదీ లోకేష్ పై చూపుతున్న ప్రేమాభిమానం ఎలాగుందో గ‌మ‌నించారుగా.. శెభాష్ లోకేష్ బేటా.. తు బ‌హుత్ బ‌డా లీడ‌ర్ బ‌నేగా.. అంటూ హిందీలో ఏదో అంటున్న‌ట్టున్నారు చూశారుగా.

నిజంగా ఇది లోకేష్ ని మోడీ భ‌జం త‌ట్టి మ‌రీ మెచ్చుకుంటున్నదే. కాద‌న‌డం లేదు కానీ  ఇలా ప్ర‌ధాని స్థాయి ప్ర‌శంస‌లు అంద‌డానికి లోకేష్ ప‌డ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. 

నారా భువ‌నేశ్వ‌రి- చంద్ర‌బాబు దంప‌తుల ఏకైక పుత్రుడు నారా లోకేష్. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎదుర్కున్న స‌మ‌స్య‌లు లెక్క‌లేన‌న్ని. అన్నిటినీ ఒంట‌రిగానే ఎదుర్కున్నారు. ప్ర‌తి దీ ప‌ర్స‌న‌ల్ గానే తీసుకున్నారు. పార్టీకి అన్నీ తానే స‌ర్వ‌స్వంగా వ్య‌వ‌హ‌రించారు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను చ‌వి చూశారు. నింద‌లూ నిష్టూరాల‌ను అధిగ‌మించారు.

ఒక ర‌కంగా చెబితే అభిమ‌న్యుడ్ని కౌరవ సేనలు పద్మవ్యూహంలో చుట్టు ముట్టిన‌ట్టు చుట్టుముట్టాయి ఆయ‌న్ను స‌మ‌స్య‌లు. కానీ వీరోచిత పోరాటం చేశారు. ప‌ద్మ‌వ్యూహ చేధ‌న తెలిసిన అర్జునుడిలా బయటకు వచ్చారు.  తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర మొద‌లు పెట్టిన నాటి నుంచి అన్నీ ఆటంకాలే. అతి  పెద్ద ఆటంకం తండ్రి జైలు పాలు కావ‌డం.

ఎంత మాత్రం దాన్నో క‌ష్టంగా భావించ‌లేదు. ఇష్టంగా తీస్కున్నారు. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ మామూలే అంటూ త‌న‌కు తాను న‌చ్చ‌చెప్పుకున్నారు. త‌న‌ను అరెస్టు చేస్తార‌న్న ఆందోళ‌న క‌లిగినా వాటిని లెక్క చేయ‌లేదు. పైపెచ్చు ఎన్నో కొత్త ఎత్తుగ‌డ‌లు వేశారు.

అందులో ప్ర‌ధాన‌మైన‌ది  రెడ్ బుక్. ఈ విష‌యం ఆయ‌న‌కు ఎవ‌రు చెప్పారో. లేక స్వ‌యంగా తానే అంత‌టి ఆలోచ‌నా ప‌రుడో తెలీదు కానీ, దీంతో తన‌కు తాను ఒక గేమ్ ఛేంజ‌ర్ గా నిలిచారు. దీంతో ఒక్క‌సారిగా డైన‌మిక్స్ మారిపోయాయ్. ఇపుడీ రెడ్ బుక్ ఒక ట్రెండ్. తెలంగాణ‌లో క‌విత దీన్ని కాపీ కొడుతూ తాము కూడా పింక్ బుక్ రాస్తున్నామ‌ని అన్నారు. ఒక‌రు మీ మెథ‌డ్ ఫాలో అయితే మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ ప‌ర్సంట్ హిట్టు కొట్టిన‌ట్టే. స‌క్సెస్ సాధించిన‌ట్టే. ఇటు జ‌గ‌న్ కూడా లోకేష్ ని ఫాలో అవుతూ తాము బ్లూ బుక్ తెరుస్తామ‌ని అన్నారు. అంటే లోకేష్ ఈ విష‌యంలో ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అన్న‌మాట‌. నేను ట్రెండ్ ఫాలో కాను సెట్ చేస్తాన‌నే డైలాగ్ ని నిజం చేశార‌న్న‌మాట‌. 

ఒక్కొక్క‌ళ్ల‌నూ చుచ్చు పోయిస్తానంటూ ఆయ‌న ప‌లికిన డైలాగులు సైతం డైన‌మేట్ల‌లా పేలాయి. అంతే కాదు ఒకడుగు ముందుకు వేసి ఎవ‌రు ఎక్కువ కేసులు ఎదుర్కుంటే వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామ‌న్న ప్ర‌క‌ట‌నలు చేశారు. ఇలాంటి మాట అన‌డానికి ఎంతో గ‌ట్స్ ఉండాలి. అలాంటి ద‌మ్ము ధైర్యం త‌న గుండెల నిండుగా ఉన్న‌ట్టు చెప్ప‌డ‌మే కాదు చేసి చూపించారు నారా లోకేష్.

చాలా మంది అంటుంటారు నారా లోకేష్ కి తెలుగు స‌రిగా రాదు.. అని. కానీ, ఆయ‌న ఇంగ్లీష్ లో మాట్లాడింది మీరెపుడైనా చూశారా? అమెరిక‌న్ యాక్సెంట్ దంచి కొడ‌తారు. ఆ ఫ్లో.. వేరే లెవ‌ల్. ఎంతైనా స్టాన్ ఫోర్డ్ రిట‌ర్న్డ్ క‌దా..  అంతేనా ఇవాళ జ‌గ‌న్ కి లోకేష్ కి తేడా ఏమిటో తెలుసా? జ‌గ‌న్ త‌న‌ను న‌మ్మిన కార్య‌క‌ర్త‌ల‌ను న‌ట్టేట ముంచేస్తారు. అదే లోకేష్.. వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే రియాక్ట‌వుతారు. అంతే కాదు నేనున్నానంటూ భ‌రోసా ఇస్తారు కూడా. 

మొన్నంటే మొన్న ఒక కార్య‌క‌ర్త ధైర్యం చాల‌క ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేస్తే అండ‌గా నిలిచారు లోకేష్. మీకు నేనున్నా అధైర్య ప‌డొద్ద‌న్నారు. అంతేనా.. వారి పిల్ల‌ల చ‌దువుకు, ఇతర అవసరాలకూ స‌హాయ స‌హ‌కారాల‌ను అందించి బెస్ట్ లీడ‌ర్షిప్ క్వాలిటీస్ కి కేరాఫ్ గా నిలిచారు. ఇలాంటివెన్నో.

మీకు తెలుసా.. కార్య‌క‌ర్త‌ల‌కు జీతం కావాల‌ని మొద‌ట ఘోషించింది లోకేషే. అంతే కాదు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్ ల‌ను తొలుత ప్ర‌స్తావించింది కూడా లోకేషే.  వాలంటీర్ల జీతాలు, ఇత‌ర ప‌థ‌కాల ద్వారా జ‌గ‌న్  చేసిన‌వ‌న్నీ కాపీ పేస్టే.  

ఒక స‌మ‌యం సంద‌ర్భం రాక పోవ‌డం వ‌ల్ల ఆయ‌న తాను అనుకున్న‌ది సాధించ‌లేక పోయారు. దానికి తోడు తండ్రి చాటు కొడుకుగా ఉండటం వ‌ల్ల‌.. కొన్ని ప‌నులు సాధించ‌లేక పోయారు. ఇప్పుడు లోకేష్ బాగా రాటు దేలారు. త‌న కార్య‌క‌ర్త‌ల‌కు బీమా ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి ఆదుకుంటున్నారు. ఎవ్రిథింగ్ ప‌క్కా. లైన్ క్లియ‌ర్ అన్న సంకేతాల‌ను ఇస్తున్నారు. ఎక్క‌డ ఏ చిన్న చీమ చిటుక్కుమ‌న్నా లోకేష్ కి స‌మ‌చారం చేరాల్సిందే.

ఇటు పార్టీ కావ‌చ్చు అటు ప్ర‌భుత్వం కావ‌చ్చు ఆల్ అండ‌ర్ కంట్రోల్ ఆఫ్ లోకేష్.. ఒక‌ప్పుడు ఎన్నో నీచ‌మైన మాట‌ల‌తో కించ ప‌రిచిన వారే ఇప్పుడు లోకేష్ అంటే.. అద్దిరి  ప‌డుతున్నారు. అద్భుత‌మ‌ని ప్ర‌శంసిస్తున్నారు. అప్ప‌టికీ.. ఇప్ప‌టికీ లోకేష్ లో చాలా తేడా.  ప్రెజంట్ లోకేష్ రేంజే వేరు. ఆయ‌నకు ప్ర‌త్య‌ర్ధి పార్టీల నుంచి కూడా ప్ర‌శంస‌లందుతున్నాయ్. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ నుంచి అందిన ప్ర‌శంస‌లు అలాంటివే. 

దువ్వాడ‌లా కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు లోలోప‌లే లోకేష్ ఈజ్ గ్రేట్ అని అనుకుంటున్నారు. లోకేష్ ఈజ్ లోకేష్ ఆయ‌న సూప‌ర్ అంటూ కొంద‌రు బాహాటంగా చెప్పుకుంటున్నారు. మ‌రి కొంద‌రు చెవులు కొరుక్కుంటున్నారు. ఒక‌ప్పుడు లోకేష్ అంటే చిన్న చూపు చూసిన వారు ఇవాళ ఆయ‌న స్థాయిని సామ‌ర్ధ్యాన్ని చూసి జ‌డుసుకుంటున్నారు. 

ఇప్పుడే ఇలాగుంటే వ‌చ్చే రోజుల్లో లోకేష్ లెవ‌లే వేరు కాబోతుందా అంటే అదే నిజం కాబోతుంద‌ని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. ఆయ‌నికిపుడు అన్ని రాజ‌కీయ విద్య‌లూ వ‌చ్చేశాయ్. ఒక‌ప్ప‌టి తండ్రి చాటు కొడుకు కాదాయ‌న‌. నారా లోకేష్ స‌న్నాఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు స్థాయి కాదు త‌న‌ది.  నారా చంద్ర‌బాబు ఫాద‌రాఫ్ నారా లోకేష్ రేంజికి అత్యంత త్వ‌ర‌లోనే చేరేలా క‌నిపిస్తున్నారు.

అంత దీటుగా ధాటుగా క‌నిపిస్తున్నారు.. నారా లోకేష్ త‌న బాడీ లాంగ్వేజ్ ద‌గ్గర నుంచి మొద‌లు పెట్టారు. ఇప్పుడాయ‌న అత్యంత హ్యాండ్స‌మ్ గా క‌నిపిస్తున్నారు. మాట‌ల్లో ఫ్లో పెరిగింది. అగ్రెసివ్ నెస్ వ‌చ్చి చేరింది. ఇప్పుడాయ‌నది ఏపీ పొలిటిక‌ల్ ఐకానిక్ లీడ‌ర్షిప్.   అంత‌గా ప‌రిణితి చెందారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తూ వ‌చ్చారు కాబ‌ట్టే మోడీ లోకేష్ భుజం మీద చెయ్యేసి శ‌భాష్ బేటా అని ప్ర‌సంశిస్తున్నారని అంటున్నారు పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు.

ఆల్ ద బెస్ట్ లోకేష్ సార్..
వి హోప్ బెట‌ర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్
ఇన్ క‌మింగ్ డేస్......
అన్న‌ది ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త నుంచి వినిపిస్తోన్న కామెంట్!

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.