మినీ జమిలి.. లోక్ సభతో పాటే 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు!

Publish Date:Jul 10, 2023

Advertisement

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీ పరస్పెక్టివ్ ను పూర్తిగా మార్చేసిందా? అంతకు ముందు వరకూ  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయంపై ఉన్న ధీమా ఒకింత తగ్గినట్టుగా కనిపిస్తోంది. అందుకే గత తొమ్మిదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులకు స్థాన భ్రంశం కల్పించింది. త్వరలో మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకర చేయనున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా సన్నగిల్లడం వల్లనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అంతే కాకుండా బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలు కొలిక్కి వచ్చేలోగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందని అంటున్నారు. అందుకే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు కూడా నగారా మోగిస్తే ఎన్నికలలో లబ్ధి పొందే అవకాశాలు ఒకింత మెరుగ్గా ఉంటాయని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకే కాకుండా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో మాటు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తుగానే ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న యోచన చేస్తున్నదంటున్నారు.

ఏపీ వంటి రాష్ట్రాలు ముందస్తుకు రెఢీగా ఉన్నాయనీ, అలా రెడీగా లేని రాష్ట్రాలను కూడా ఒప్పించి ఏదో విధంగా ఈ ఏడాది చివరికే పలు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరిపించేస్తే.. విపక్షాలు ఐక్యతాయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం, ఎన్నికలకు అవి ఇంకా పూర్తిగా సంసిద్ధంగా లేకపోవడంతో  అధికారంలో ఉన్న బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయన్నది మోడీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే  నరేంద్రమోడీ మినీ జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని అంటున్నారు.  గతంలో నరేంద్రమోడీ జమిలి ఎన్నికల నిర్వహణ పై  ఆసక్తి కనబరిచినా, అయితే అది అనుకున్నంత ఈజీ కాదని తేలిపోవడంతో అప్పటికి మిన్న కున్నారనీ,ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మినీ జనరల్ ఎలక్షన్ కు వెళితే.. అంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలనూ కలుపుకుని సార్వత్రిక ఎన్నికలకు వెడితే రాజకీయంగా తమ విజయానికి తిరుగుండదన్న భావన మోడీలో బంలంగా ఉందని చెబుతున్నారు.    

 డిసెంబర్ నెల లో ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగాల్సుంది. అలాగే  వచ్చే ఏడాది మే-జూన్ నెల లో మరో ఆరు  రాష్ట్రాల కు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు పెండింగు జరగాల్సి ఉంది.  మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో జరగాల్సి ఉంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోనే జరగాల్సి ఉంది.  దీనిని దృష్టిలో  ఉంచుకునే ఈ డిసెంబర్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ను ఓ మూడునెలలు వాయిదా వేయడమో లేదా వచ్చే ఏడాది మే, జూన్ లలో జరగాల్సిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరపడమో చేస్తే  శ్రమ, వ్యయం, సమయం అన్నీ కలిసి వస్తాయన్నది మోడీ ఆలోచనగా చెబుతున్నారు.

 అయితే ఈ ఏడాది చివరిలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటే.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ కావాలి. అలా కాకుండా వచ్చే ఏడాది  మే, జూన్ లో జరగాల్సిన ఎన్నికలను ముందుకు జరపడం అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. దీంతో మోడీ రెండో ఆప్షన్ కే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.