జాతికి మోడీ అబద్ధాలు చెప్పారు.. ఖర్గే

Publish Date:Apr 18, 2026

Advertisement

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా నిరాశాజనకంగా ఉందని, ఆ ప్రసంగంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు.  ఒక అధికారిక ప్రసంగాన్ని మోదీ రాజకీయ ప్రసంగంగా మార్చేశారని..  ప్రత్యర్థులపై బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాటలు ఉన్నాయని ఖర్గే దుమ్మెత్తిపోశారు.

మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.  మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి నిజంగా ఉంటే, 2023లోనే ఆమోదం పొందిన చట్టాన్ని ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దాన్ని నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం మహిళా లోకాన్ని మోసం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని తన ప్రసంగంలో మహిళల సంక్షేమం గురించి కాకుండా, కాంగ్రెస్ ను విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారన్న ఖర్గే.. మోడీ ప్రసంగంలో కాంగ్రెస్  పేరును   59 సార్లు ప్రస్తావించారని చెప్పారు. మహిళల గురించి మాట్లాడింది చాలా తక్కువ అని చెప్పారు. దీన్ని బట్టి ప్రధానికి మహిళల అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని అవగతమౌతోందన్నారు.  

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ విపక్షాలపై ప్రధాని విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖర్గే పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి ప్రచారం చేయడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూసిందన్నారు.  మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.