విపక్షాల తీరుకు నిరసనగా దేశవ్యాప్త నిరసనలక బీజేపీ కార్యాచారణ

Publish Date:Apr 18, 2026

Advertisement

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీజేపీ మండిపడుతోంది. దేశంలోని సగం జనాభా ప్రయోజనాలను విపక్షాలు కాలరాశాయని ఫైర్ అవుతోంది.  దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని  నిర్ణయించింది. చారిత్రాత్మకమైన ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు తమ మహిళా వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నాయని విమర్శిస్తోంది.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినంత మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యులలో 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం.

  ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఓటమి కేవలం ప్రభుత్వానిది కాదని, దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు తగిలిన దెబ్బగా బీజేపీ అభివర్ణించింది.

రాజ్యాంగ సవరణ బిల్లుతో  ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు పునర్విభజన ప్రక్రియ కీలకమని ప్రభుత్వం వాదించినప్పటికీ..  దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనతో విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు వాదించారు.  

మహిళల హక్కులను అడ్డుకున్న విపక్షాల అసలు రంగును బయటపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్  హెచ్చరించారు. గ్రామం నుంచి నగరం వరకు నిరసనలుతెలియజేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.  ఇప్పటికే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన బీజేపీ నేతలు.. రానున్న రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై  కార్యాచరణ  రూపొందించారు. పార్లమెంట్ ఆవరణలో కూడా ఎన్‌డీఏ మహిళా ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.  విపక్షాల మహిళా వ్యతిరేక ముఖం బయటపడిందంటూ నినాదాలు చేశారు.

మహిళా రిజర్వేషన్ల విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు  రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకున్నాయని  విమర్శించారు.  ఒకవైపు ప్రభుత్వం తన ప్రయత్నాన్ని సమర్థించుకుంటుండగా, మరోవైపు విపక్షాలు డీలిమిటేషన్ సాకుతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో  చూడాలి.ఈ బిల్లు వీగిపోవడం వల్ల 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన లేకుండా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ రాజకీయ ప్రతిష్టంభన మధ్య మహిళా హక్కుల అంశం ఇప్పుడు వీధి పోరాటంగా మారనుంది.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.