జగన్ ను దూరం పెట్టేసిన మోడీ.. వైసీపీ వాట్ నెక్స్ట్?

Publish Date:Oct 7, 2023

Advertisement

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.   రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. నిలదీశారని కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే, అసలు మంత్రులతో ఏం మాట్లాడారన్నది మాత్రం వీడని సస్పెన్నే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తి రేగింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి జగన్ ఢిల్లీ వెళ్తుండడంతో.. ఢిల్లీలో జగన్ ఎవరిని కలుస్తారు? ఏం మాట్లాడతారు?   రాజకీయాలలో ఏమైనా కీలక పరిణామాలు ఉంటాయా అన్న చర్చలు సాగాయి. ముఖ్యంగా ఏపీలో బీజేపీ ప్రయాణం ఎటు వైపు అనే దానిపై ఏదైనా స్పష్టత వస్తుందా అన్న ఆసక్తి కూడా కనిపించింది. 

అయితే, స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లిన జగన్ అదే ఫ్లైట్ లో మళ్ళీ తాడేపల్లి కూడా రానే వచ్చారు. అక్కడ ఏం జరిగిందో ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాల్సింది చెప్పారు. అయితే, ఇప్పటికైతే జగన్ ఢిల్లీ పర్యటనతో అద్భుతాలేమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు చర్చించిన అంశాలు కూడా జరిగేవి కాదు.   కేంద్రాన్ని జగన్ ఎంత మేర ప్రశ్నించారో కూడా ఏపీ ప్రజలు అర్ధం చేసుకోగలరు. అయితే, ఒక్కసారి జగన్ ఢిల్లీ పర్యటనను పరిశీలిస్తే రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. గట్టిగా మాట్లాడితే జగన్ ఢిల్లీ వెళ్లేముందు వైసీపీ వర్గాలు ఊహించుకుంది వేరు.. అక్కడ జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధం. జగన్ ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆయన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారని ప్రభుత్వ వర్గాలు చెప్పుకున్నాయి. అలాగే రాజకీయ అంశాలు ఇద్దరు నేతల మధ్యన ఖచ్చితంగా వచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అయితే, ఎన్నో ఆశలతో హస్తినకు వెళ్లిన సీఎం జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మొహం చాటేశారు. జగన్ కు పీఎంఓ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ లభించకపోవడం చర్చకు దారితీస్తోంది. నిజానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అందుబాటులో ఉంటారన్న కచ్చితమైన సమాచారంతోనే  సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. అసలు లండన్ పర్యటన నుంచి రాగానే హస్తిన పర్యటన పెట్టుకున్న జగన్ అప్పట్లో   ప్రధాని అందుబాటులో ఉండరని, అప్పాయింట్ మెంట్ దొరకదని ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈసారి ఇద్దరు అందుబాటులో ఉంటారనే పక్కా సమాచారంతోనే జగన్ ఢిల్లీ వెళ్లారు. ఆ ఇద్దరి నేతల అపాయింట్మెంట్లు దొరికాయని కూడా వైసీపీ నేతలు చెప్పుకున్నారు. కానీ ఒక్క హోం మంత్రి అమిత్ షా మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే, కృష్ణా జలాల వివాదంపై జగన్ ప్రధానికి లేఖ రాసి వెనుతిరిగినట్లు ప్రభుత్వం మీడియాకు సమాచారం ఇచ్చింది. కానీ, జగన్ ను కలవడం ఇష్టం లేకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఢిల్లీ వర్గాల సమాచారం.

 ఏపీ సమస్యలు, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ బీజేపీ పెద్దలకు తెలిసిందే.  పైగా చంద్రబాబు అరెస్టు అంశంలో బీజేపీ అండ ఉందని జగన్ పార్టీ నేతలు చేసిన ప్రచారం,  మరోవైపు జగన్ కారణంగానే ఏపీలో ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన కూడా దూరం జరగడం కూడా ప్రధాని మోడీ జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వక పోవడానికి కారణంగా చెబుతున్నారు. అదీ కాక  తెలంగాణలో ఎన్నికల సమయం కనుక జగన్ ప్రస్తావించాలనుకున్న కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోగలిగే అంశం కాదు. పాము చావాలి.. కర్ర విరగకూడదు అన్న సిద్ధాంతాన్ని పాటించే బీజేపీ ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాలపై ఓపెన్ కావడం ఇష్టం లేకనే   మోడీ సీఎం జగన్ కు అపాయింట్ ఇవ్వలేదని అంటున్నారు. ఇక అమిత్ షా అయితే చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలు, బాబు అరెస్టుకు కేంద్రం మద్దతు ఉందన్న వైసీపీ ప్రచారం తదితర అంశాలపై జగన్ కు గట్టిగా క్లాస్ పీకినట్లు హస్తిన వర్గాలు చెబుతున్నాయి.  2014 నాటి పరిస్థితి ఏపీలో పునరావృతం కావాలన్నది తన అభిమతమని, తెలుగుదేశం, జనసేనతో పాటు బీజేపీ కూడా కలవాలని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటికీ,  ఏపీలో   ఇప్పటికైతే తటస్థంగా ఉండాలనే బీజేపీ భావిస్తోందనీ, అందుకే మోడీ జగన్ ను దూరం పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.