Publish Date:Jun 26, 2026
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నారా? కేవలం మార్పులు, చేర్పులే కాకుండా.. మోడీ కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారా? అంటే ఎన్డీయే వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ క్యాబినెట్ దాదాపు మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ముఖ్యంగా కీలక శాఖల మంత్రులు సుదీర్ఘ కాలంగా అవే శాఖలలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కీలక శాఖల మంత్రులను మార్చాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంత్రులపై క్షేత్రస్థాయిలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగానే మోడీ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ముర్ముతో భేటీలో అమిత్ షా కేంద్ర క్యాబినెట్ మార్పుల గురించిన సమాచారాన్నిఆమెకు వివరించినట్లు ఎన్డీయే వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదలా ఉంటే.. ఈ కేబినెట్ ప్రక్షాళనలో విత్త, విద్యా శాఖ మంత్రులకు ఉద్వాసన లేదా స్థాన చలనం తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. వీరిలో నిర్మలాసీతారామన్ గత పదేళ్లుగా దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రదాన్ పై ఇటీవలి నీట్ పేపర్ లీక్ తరువాత దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కాక్రోచ్ జనతాపార్టీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఏకైక ఎజెండా, డిమాండ్ తో దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టింది. అదీ కాకుండా.. నీట్ పేపర్ లీక్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించడంతో.. ఆయనకు ఉద్వానస పలకాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు కేబినెట్ నుంచి ఉద్వాసన కాకుండా, ఆమె శాఖను మార్చే అవకాశాలున్నాయంటున్నారు. నిర్మలా సీతారామన్ కు మానవవనరులు లేదా మరో శాఖను అప్పగించే అవకాశాలున్నాయని ఎన్డీయే వర్గాల భోగట్టా. వీరే కాకుండా మరి కొందరు మంత్రులకు కూడా శాఖల మార్పు లేదా ఉద్వాసన ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకూ మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్రం నురంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-cabinet-reshuffle-on-the-29th-25-224219.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?