29న మోడీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ?.. నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ లకు ఉద్వాసన?

Publish Date:Jun 26, 2026

Advertisement

 

ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నారా? కేవలం మార్పులు, చేర్పులే కాకుండా.. మోడీ కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారా? అంటే ఎన్డీయే వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ  క్యాబినెట్ దాదాపు మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ముఖ్యంగా కీలక శాఖల మంత్రులు సుదీర్ఘ కాలంగా అవే శాఖలలో కొనసాగుతున్నారు.  అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కీలక శాఖల మంత్రులను మార్చాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంత్రులపై క్షేత్రస్థాయిలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగానే మోడీ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ  తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని  అంటున్నారు.  మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29)  క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. 

 కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ముర్ముతో భేటీలో   అమిత్ షా కేంద్ర క్యాబినెట్ మార్పుల గురించిన   సమాచారాన్నిఆమెకు వివరించినట్లు ఎన్డీయే వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదలా ఉంటే..  ఈ కేబినెట్ ప్రక్షాళనలో విత్త, విద్యా శాఖ మంత్రులకు ఉద్వాసన లేదా స్థాన చలనం తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది.  వీరిలో నిర్మలాసీతారామన్ గత పదేళ్లుగా దేశ ఆర్థిక మంత్రిగా  కొనసాగుతున్నారు.  ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రదాన్ పై ఇటీవలి నీట్ పేపర్ లీక్ తరువాత దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కాక్రోచ్ జనతాపార్టీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఏకైక ఎజెండా, డిమాండ్ తో దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టింది.  అదీ కాకుండా.. నీట్ పేపర్ లీక్   ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించడంతో.. ఆయనకు ఉద్వానస పలకాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు కేబినెట్ నుంచి ఉద్వాసన కాకుండా, ఆమె శాఖను మార్చే అవకాశాలున్నాయంటున్నారు. నిర్మలా సీతారామన్ కు మానవవనరులు లేదా మరో శాఖను అప్పగించే అవకాశాలున్నాయని ఎన్డీయే వర్గాల భోగట్టా.  వీరే కాకుండా మరి కొందరు మంత్రులకు కూడా శాఖల మార్పు లేదా ఉద్వాసన ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకూ మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్రం నురంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.  

By
en-us Political News

  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.