హ్యాట్రిక్ లక్ష్యంగా మోడీ మంత్రివర్గంలో మార్పులు?

Publish Date:Jan 1, 2023

Advertisement

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు సిద్దమవుతున్నారా? కొత్త సంవత్సరంలో జనవరి 14 తర్వాత  పెద్ద మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు మోడీ, షా మంత్రాంగం సాగిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కమలదళం కీలక నేతలు. అంతే కాదు  ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా కాషాయ కూటమి పెద్దలు చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా, పార్టీ పదవుల్లోనూ సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జనవరిలో జరగనుంది. కాగా, వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. నిజానికి నడ్డాను  2024 ఎన్నికలవరకు అధ్యక్ష పదవిలో  కొనసాగిస్తారని, ఆ మేరకు నిర్ణయం జరిగిందని పార్టీలో  ప్రచారం జరిగింది. అయితే, అధికారిక  ప్రకటన ఏదీ వెలువడలేదు. అయినా, పాతికేళ్ళ తర్వాత తొలిసారిగా, అధ్యక్ష ఎన్నికలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, నడ్డాకు ఎక్స్ టెన్షన్ ఇవ్వడాన్ని, తప్పు పట్టే అవకాశఇం లేదు. అలాగే, నడ్డా స్వరాష్ట్రం హిమాచల్’లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమనే విమర్శలు వినవచ్చాయి. ఈ నేపధ్యంలో నడ్డాను కొనసాగించే విషయంలో  పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.  అందుకే  2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో మార్పులు చేపట్టే విషయంలో పార్టీ పెద్దలు  విభిన్న స్థాయిల్లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కొంతమంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అలాగే, మహా రాష్ట్రలో శివసేన చీలిక వర్గం ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే ఆకాశం ఉందని అంటున్నారు. గతంలో శివసేన ఎన్డీఎలో  ఉన్నరోజుల్లో కేంద్ర మంత్రి వర్గంలో ముగ్గురు నలుగురికి  స్థానం దక్కింది. అలాగే, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కడుపుతున్న బీజేపీ నాయకత్వం, రాష్ట్రం నుంచి మరొకరికి మంత్రి వర్గంలో స్థానం కలిపించే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీ నుంచి కూడా ఒకరికి స్థానం  దక్కుతుందని అంటున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంలో స్పష్టత రాలేదు. 
మరో వంక  పని తీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ కూడా సాగుతోంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జులై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది.  12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు.

ఈసారి కూడా అంత పెద్ద ఎత్తున ఉద్వాసనలు ఉంటాయా, లేక కొద్ది మందితో సరిపెడతారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, ఏది జరిగినా, ఎన్నికల లెక్కలు ఆధారంగానే జరుగుతుందని, మోడీ సర్కార్ హ్యాట్రిక్  లక్ష్యంగానే మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. నిజానికి విపక్షాల బలహీనత, బీజేపీకి కలిసి వచ్చే అంశంగా అందరూ భావిస్తున్నా బీజేపీ నాయకత్వం మాత్రం మరోలా లోచిస్తోందని అంటున్నారు.

యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం పునరావృతమైంది. తాజాగా గుజరాత్‌లో కూడా భారీ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరాజయం పాలైంది. మరో వంక మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పటికే దూరమయ్యాయి.. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడి కక్కడ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితులు, పరిణామాలు అన్నింటినీ బేరీజు వేసుకుని  మోడీ హ్యాట్రిక్ లక్ష్యంగా బీజేపీ మంత్రి వర్గంలో, పార్టీలో మార్పులకు భారీ కసరత్తు చేస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.