అమరావతికి మోడీ.. భారీ ప్యాకేజీపై రాష్ట్ర ప్రజల ఆశలు!

Publish Date:Apr 17, 2025

Advertisement

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మోడీ పర్యటనకు, పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి  ఏర్పాట్లు శరవేగంగా జరుగు తున్నాయి. మే2వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పీఎం పర్యటనపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారలతో సమీక్ష నిర్వహించారు.

మోడీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహిం చాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మోడీ సభకు దాదాపు 5లక్షల మంది ప్రజల పాల్గొంటారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనక 250 ఎకరాల విస్తీర్ణంలో మోడీ సభ జరగనుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడినా ఎటువంటి ఇబ్బందీ లేకుండా సభా స్థలంలో వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఓకే కానీ గతంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చిన సందర్భంగా మోడీ పవిత్ర జలాలు, పుణ్య క్షేత్రాల నుంచి మట్టి తీసుకువచ్చారు. ఈ సారి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రానున్న మోడీ ఏం తీసుకువస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ప్రధాని హోదాలో అమరావతి నిర్మాణానికి నరేంద్రమోడీ 2017లో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి మోడీ ఆ సందర్బంగా భారీ వరాలను ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుణ్య స్థలాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి జలం తీసుకువచ్చిన మోడీ ఏపీకి కానీ, ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ఆయన నోటీతోనే చెప్పిన అమరావతికి కానీ ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదు. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.  

దీంతో ఈ సారి మోడీ అమరావతికి ఏం చేస్తారు? ఏం ఇస్తారు? అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అప్పట్లో అంటే 2017లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ మాత్రమే. అయితే తెలుగుదేశం మద్దతు లేకంటే కేంద్ర సర్కార్ కు అప్పట్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి అది కాదు. 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ కు తెలుగుదేశం మద్దతు అత్యవసరంగా మారింది. తెలుగుదేవం మద్దతుతోనే మోడీ సర్కార్ మనుగడ సాగుతుందన్న పరిస్థితి ఉంది. దీంతో  కేంద్ర ప్రభుత్వం ఏపీకీ, అలాగే తెలుగుదేశం పార్టీకీ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా కేంద్ర కేబినెట్ బెర్తులు వంటి విషయాలలో పట్టుబట్టకుండా, ఏపీకి ఇతోధిక ఆర్థిక తోడ్పాటుపైనే పట్టుబడుతున్నారు.

ఆ కారణంగానే  అమరావతికి కేంద్రం నుంచి అనూహ్య మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంకు రుణంతో పాటుగా హడ్కో రుణాలకు కేంద్రం గ్యారెంటీ ఇచ్చి మరీ అమరావతికి అండగా నిలిచింది. అంతే కాకుం డా అడగకుండానే  అమరావతికి రైల్వే లైను, అవుటర్ రింగు రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులు, ఇలా వరాలు ఇచ్చేసింది,  ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ కచ్చితంగా రాజధాని అమరావతికి ఓ భారీ ప్యాకేజీ ప్రకటిస్తారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  సామాన్య జనం నుంచీ రాజకీయ పరిశీలకులు కూడా  అమరావతి పనులకు నిధుల కొరత మాట లేకుండా మోడీ భారీ వరాలను ఇచ్చే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు.  

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.