ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సిట్ దూకుడు.. ఇక రాజకీయ దుమారమేనా?

Publish Date:Nov 18, 2022

Advertisement

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సిట్ దూకుడు పెంచింది.   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు  ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు కమాండ్ కంట్రోల్‌ కేంద్రంలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సీఆర్ పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది.   విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో హెచ్చరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసుకు సంబంధించి  అధికారులు అక్టోబర్ 26న ఆడియో, వీడియో సంభాషణలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. వారితో సంబంధాలు ఉన్న వారికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అందులో ప్రధానంగా ఎన్డీయే కన్వీనర్ తుషార్ తో పాటు కేరళకు చెందిన వైద్యుడు డాక్టర్ జగ్గు స్వామి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రధాన అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ కు ఉన్నారు.

ఫ్లైట్ టికెట్ల కొనుగోలులో వీరందరి ప్రమేయం ఉందని, సిట్ అనుమానిస్తోంది. పైలెట్ రోహిత్ రెడ్డితో   మాట్లాడారంటూ వీరి పేర్లు ప్రస్తావనకు రావడంతో వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంతోష్ కు సైతం సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.  ఈ కేసులో ఇప్పటివరకు నలుగురికి నోటీసులు జారీ చేశారు. కేరళ, చిత్తూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని (నందకుమార్, సింహయాజి స్వామి, రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ) అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆ ముగ్గురి స్టేట్ మెంట్ నమోదు చేశారు.  

కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్య కళాశాలలో పని చేస్తున్న జగ్గుస్వామి ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయారు. జగ్గుస్వామి ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం గాలించినా ఆయన చిక్కకపోవడంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి అనుబంధంగా ఉన్న బీడీజెఎస్ (భారత్ ధర్మ జనసేన) అధ్యక్షుడు తుషార్‌కు కూడా సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సిట్ అధికారులు ఐదు రోజుల పాటు కేరళలో దర్యాప్తు చేశారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు కేరళ వెళ్లి దర్యాప్తు చేశారు. ఇక కరీంనగర్ కు చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

 సింహయాజీ స్వామీజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి న్యాయవాది శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. వీళ్లిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? ఎవరైనా చెబితే టికెట్ బుక్ చేశారా? అనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఉండగా  సిట్‌ నోటీసులపై బీజేపీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బి.ఎల్‌. సంతోష్‌, న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని ఇరికించేందుకు సిట్‌ నోటీసులిచ్చి వేధిస్తోందని పేర్కొంటూ.. వీటిపై స్టే ఇవ్వాలని కోరారు.

ఈ కేసులో నలుగురికి (తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాస్, బీఎల్ సంతోష్) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందరికీ సీఆర్ పీసీ సెక్షన్ 41ఏ కిందే నోటీసులు ఇచ్చారు. వారందరిని ఒకే రోజున విచారణకు పిలిచారు. ఒకే రోజున అందరినీ  సిట్ ప్రశ్నించనుంది. ఫామ్ హౌస్ బేరసారాల సమయంలో నిందితుల నోట బీఎల్ సంతోష్, తుషార్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తుషార్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.