ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... దిగువకోర్టు సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు

Publish Date:Oct 28, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన కేసులో మరో ట్విస్ట్  చోటుచేసుకుంది.  ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితుల రిమాం డ్‌ను నిరాకరిస్తూ దిగువకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు శుక్ర వారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

పోలీసులు లంచ్ మోషన్‌ను తరలించడం ద్వారా ముందస్తు విచారణను కోరింది, అయితే కోర్టు రెగ్యులర్ పిటిషన్‌ను కోరింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్,  సింహయాజి స్వామి అనే ముగ్గురు నిందితులను విడుదల చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పోలీ సులు సవాలు చేశారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు  బుధవారం రాత్రి టీఆర్ ఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఎరచూపించి బీజపీ పార్టీలోకి  తీసుకు రావడానికి, పార్టీలో ఉన్నత పదవులతో పాటు కాంట్రాక్టులు కూడా ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకోవడానికి  ప్రయ త్నించారు. ఆ ముగ్గుకు వ్యక్తులను సరూర్ నగర్ లో న్యాయమూర్తి నివాసానికి గురువారం రాత్రి పోలీసులు తీసికెళ్లారు. కానీ నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి పంపేం దుకు పోలీసులు చేసిన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు. 

నిందితులుగా పేర్కొన్న ముగ్గురు టీ ఆర్ ఎస్ నాయకులను పార్టీలోకి  ఆకట్టుకోవడానికి  చేసే యత్నం లో డబ్బు ఆశ చూపారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి పోలీసుల అభ్యర్ధ నను నిరాకరించారు. సాక్ష్యాధారాలు సరిగా లేనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని ఆయన అన్నారు. 

కాగా,ఈ కేసు విషయంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.  బీజేపీ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ తెలంగాణా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 
మునుగోడు ఉప ఎన్నికలనేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్  కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేస్‌ని సమగ్రంగా విచారణ జరిపించాలని పిటిష నర్ హైకోర్టును కోరారు. పిటిషన్‌లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు. 

తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ , సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్ఓ  కేంద్ర హోం ఆఫ్ఫైర్స్, సీబీఐ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డినీ పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐతో, సిట్టింగ్ జడ్జ్‌తో సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పేర్కొన్నారు.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.