టీడీపీ యువనేతల్లో టిక్కెట్ల జోష్..

Publish Date:Mar 31, 2022

Advertisement

‘వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టిక్కెట్లు పక్కా’ టీడీపీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రకటనతో టీడీపీ యువతలో ఫుల్ జోష్ వచ్చింది. అతిరథ మహారథులు, పార్టీ ఆవిర్భావం నుంచీ సీనియర్ మోస్ట్ నేతలు ఉన్న టీడీపీలో తమకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా? అని ఎదురు చూస్తున్న పార్టీ యువనేతల్లో అధినేత ప్రకటనతో హార్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు ప్రకటనతో ఇప్పటికైనా తమ కష్టం ఫలించి, చట్టసభల్లో అడుగుపెట్టేందుకు అవకాశం లభించబోతోందన్న ఆనందం వారిలో వెల్లివిరుస్తోంది.

నిజానికి ఈ 40 శాతం టిక్కెట్లు ఇస్తామనే సాంప్రదాయాన్ని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారకరామారావు తీసుకొచ్చారు. ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పలువురు యువ నేతలకు టీడీపీ టిక్కెట్తు ఇస్తూనే ఉన్నారు. అయితే.. ఇంత శాతం తప్పకుండా యువకులకే ఇస్తామనే రూల్ ఏదీ పెట్టలేదు. అయినప్పటికీ ఆయన యువతకు పెద్దపీటనే వేస్తూ వస్తున్నారు. తాజాగా 40 శాతం టిక్కెట్లు తప్పకుండా యువకులకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 40 శాతం చొప్పున  దాదాపు 70 టిక్కెట్లు యువతకే కేటాయిస్తారన్నమాట. అలా 70 మంది యువ నేతలకు టిక్కెట్లు లభిస్తే.. టీడీపీ యువరక్తంతో మరింత చైతన్యవంతంగా ఉరకలెత్తుందనడంలో సందేహం ఉండదంటున్నారు.

ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు కొందరు పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంతరంగిక చర్చల సందర్భంగా సూచిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్లు కొందరు చంద్రబాబుతో జరిగిన, జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఇదే విషయం సూచిస్తున్నారట. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి, సేవలు అందించిన సీనియర్లలో కొందరికి ఇచ్చే టిక్కెట్లలో యువరక్తం నింపాలని వారు సలహా ఇస్తుండడం గమనార్హం. అలా యూత్ కు ప్రాధాన్యం ఇస్తే మరో నాలుగు దశాబ్దాల పాటు టీడీపీకి తిరుగే ఉండదనేది వారు చెబుతున్న మాట.

యువతకు ప్రాధాన్యం విషయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా సుముఖంగా ఉన్నారంటున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఇప్పటికే యువతను ఓన్ చేసుకునే పనిలో ఉన్నారు. గతంలో కంటే లోకేష్ రాజకీయ ప్రసంగాల్లో ఆరితేరారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తన ప్రసంగాలతో యువతను బాగా ఆకట్టుకుంటున్నారు. వైసీపీ సర్కార్ చేసే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని, అనాలోచిత చర్యనూ లోకేష్ తూర్పాపట్టి ఎండగడుతున్న తీరు యువతలో మంచి క్రేజ్ తీసుకొస్తోంది. పార్టీ ప్రకటించిన అన్ని కమిటీల్లోనూ యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యువతను ఆకర్షించే విధంగా లోకేష్ నిర్వహించే కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి.

అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ను భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి సర్కార్ ను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించాలని ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీని ఆర్థికంగా దివాలా తీయించడమే కాకుండా.. వేల కోట్ల అప్పుల్లో ముంచేసిన వైసీపీ సర్కార్ ను నిట్టనిలువునా పాతరేయాలనే చర్చ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశం చేయగల దమ్మున్న పార్టీ టీడీపీయే అని, విడిపోయి అన్నివిధాలా అన్యాయమైపోయిన ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించగల సత్తా టీడీపీకి, చంద్రబాబుకే ఉన్నాయనే నమ్మకం జనంలో ఇప్పటికీ సజీవంగానే ఉందట. అందుకు అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబు పనితీరును వారు మర్చిపోలేకపోతున్నారు.

ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సమయం దూరంలో ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే యువతను అందుకు సిద్ధం చేసేలా, కార్యరంగంలో దూకేలా చంద్రబాబు నాయుడి ప్రకటన ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రకటనతో భవిష్యత్తులో టీడీపీలో యువత ప్రధాన పాత్ర పోషించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనేది పరిశీలకుల అభిప్రాయం.

అయితే.. టీడీపీలో టిక్కెట్లు ఇచ్చే విషయంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ సీనియర్ నేతలను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేయకపోవచ్చని అంటున్నారు. యువతకు తాను ప్రకటించిన కోటా ప్రకారం టిక్కెట్లు ఇచ్చినా.. సీనియర్ల ప్రాధాన్యత కూడా తగ్గకుండా చంద్రబాబు బ్యాలెన్స్ చేస్తారని అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగం.. యువతలో మరింత చైతన్యాన్ని, జోష్ ను నింపిందని అంటున్నారు. ఇప్పటి నుంచి తమతమ నియోజకవర్గాల్లో వారు కార్యక్రమాలు నిర్వహించి, వారు నిత్యం ప్రజల్లో ఉండేలా చేస్తుందంటున్నారు. మొత్తం మీద వైసీపీ సర్కార్, ఆ పార్టీ నేతల ఆగడాలను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు యువతతో చక్రం తిప్పే వ్యూహాన్ని తెరమీదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.