రోజా బేజార్!.. మంత్రిప‌ద‌వి కోసం 'టెంపుల్ ర‌న్‌'!

Publish Date:Apr 1, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ రెడ్డి కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించడం మాటేమో గానీ.. అమాత్య పదవి తనకు దక్కుతుందో లేదో.. ఒకవేళ వస్తే ఏ పోర్టుఫోలియో వస్తుందో అనే సందేహాలు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాలో బాగా పెరిగిపోతున్నట్లున్నాయి. జిల్లాల ఈక్వేషన్లు, కులాల సమీకరణాలతో తనను కేబినెట్ పదవి వరించే ఛాన్స్ వస్తోందో రాదో అనే గుబులు కూడా రోజాలో గూడుకట్టుకుంటోందంటున్నారు. జగన్ తొలిసారి కేబినెట్ ను ప్రకటించినప్పుడే రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మారుస్తానని చెప్పారు. జగన్ చెప్పిన కొత్త కేబినెట్ ప్రకటించాల్సిన సమయం ఇప్పుడు రానే వచ్చింది.

నగరి నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. వైసీపీ చీఫ్ జగన్ తో తనకు ఉన్న చనువుతో అప్పుడే కేబినెట్ బెర్త్ ఆశించారు. అయితే.. అప్పటి సమీకరణాల కారణంగా రోజాకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత కొంతకాలానికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చి రోజాను సీఎం జగన్ కాస్త చల్లబరిచారని చెబుతారు. అయితే.. తాజాగా కేబినెట్ రీషఫిల్ లో అయినా తనకు బెర్త్ కన్ ఫాం అని రోజా నమ్ముకున్నారు. ఆ దిశగా రోజాకు జగన్ నుంచి హామీ లభించిందని చెబుతున్నారు.

కానీ.. ఏ కారణం చేతనైనా తనకు మంత్రి పదవి ఇప్పుడైనా దక్కకపోతే ఎలా అనే భయం రోజాను వెంటాడుతున్నట్లుంది. అందుకే ఆమె మార్చి నెల మొదటి నుంచీ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎలాగైనా తనకు కేబినెట్ బెర్త్ దక్కేలా చేయాలని కనిపించిన దేవుళ్లు, దేవతలను మొక్కులు మొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్కే రోజా శుక్రవారం తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చాలా కాలం తర్వాత తాను స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే అవకాశం వచ్చిందని రోజా అన్నారు. యాదాద్రి వైభవాన్ని చూసి మురిసిపోయారు.

అంతకు ముందు నుంచే ఆర్కే రోజా ఏపీలోని పలు దేవాలయాలను క్రమం తప్పకుండా దర్శించుకోవడం గమనార్హం. ఇటీవలే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని సువర్ణముఖినది తీరంలో వెలసిన వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్లను రోజా దర్శించుకున్నారు. ముక్కంటి సేవలో పాల్గొన్నారు. పనిలో పనిగా తనకు మంత్రి పదవి దక్కేలా చూడమని స్వామి, అమ్మవార్లను కోరుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాశివరాత్రి రోజునే శ్రీకాళహస్తితో పాటు పలు ఇతర ఆలయాలను కూడా ఆర్కే రోజా సందర్శించారు. సత్యవేడు నియోజకవర్గంలోని సురుటుపల్లిలో వెలసిన చరిత్రాత్మక దేవాలయం శ్రీ పల్లి కొండేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. తన సొంత నియోజకవర్గంలోని నగరి మండలంలో ఉన్న బుగ్గ అగ్రహారంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర- అన్నపూర్ణాదేవి ఆలయంలో పూజల్లో రోజా పాల్గొన్నారు. పుత్తూరు పట్టణంలోని చరిత్రాత్మక శ్రీ కామాక్షిదేవి సమేత సదాశివేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

మార్చినెల 11న కృష్ణా జిల్లా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శుక్రవారం పూజలో రోజా పాల్గొన్నారు. మార్చి 17న ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని బాలా త్రిపురసుందరీదేవి- త్రిపురాంతకేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 26న కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకుడి సేవలో రోజా పాల్గొన్నారు. కాణిపాకం దేవాలయానికి గోమాతను బహూకరించి, గోపూజ చేశారు. స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెనక ఉన్న నక్షత్ర వనంలో తన నక్షత్రానికి గల వృక్షానికి ప్రత్యేకంగా పూజలు చేశారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో తిరుమల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి టీటీడీ కల్యాణ మండపాన్ని ఆర్కే రోజా ప్రారంభించారు.

అయితే.. రోజాకు సీఎం జగన్‌ మటన్, చేపలు, రొయ్యల మినిస్ట్రీ ఇస్తారని, టెన్షన్‌ పడొద్దని సోషల్‌ మీడియా వేదికగా కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరో పక్కన ప్రస్తుత హోం మంత్రి మేకతోటి సుచరితకు ఉద్వాసన చెప్పి రోజాకు ఆ మంత్రి పదవి ఇస్తారనే పుకార్లు షికారు చేస్తుండడం గమనార్హం.

ఎన్ని ఆలయాలు దర్శించుకున్నా, ఎందరు దేవుళ్లకు మొక్కులు మొక్కినా ఎమ్మెల్యే రోజాకు ఎక్కడో ఏదో అనుమానం తన్నుతున్నట్టుంది. పెద్దిరెడ్డి త‌న మంత్రి ప‌ద‌వికి చెక్ పెడతాడేమో అనే డౌట‌నుమానం ఆమెను వేధిస్తోంది. అందుకే ఈ సారైనా మంత్రి పదవి దక్కించుకోవాలని జగన్ ద‌గ్గ‌ర‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు దేవుళ్లు, దేవతల ఆశీస్సుల కోసం రోజా తాపత్రయ పడుతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.