రూ.450 కోట్ల ఆరోపణలు నిరాధారం.. బహిరంగ చర్చకు సిద్ధం : ప్రేమ్ సాగర్ రావు

Publish Date:Aug 5, 2026

Advertisement

 

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేసిన ఆయన... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సొంత పత్రికలతో పాటు ఇతర పత్రికల్లోనూ అసత్య కథనాలు ప్రచురింపజేస్తున్నారని విమర్శించారు.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించిన ఎమ్మెల్యే... సంబంధిత వ్యక్తులు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. తనపై జరుగుతున్న కుట్రలన్నీ త్వరలో బయటపడతాయని, ఆరోపణలు చేస్తున్న వారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

తాను రూ.450 కోట్లను దుర్వినియోగం చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. 2009–10లో బ్యాంకు రూ.450 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని, సాయినాథ్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేర్లపై ఆ రుణాలు తీసుకున్నామని వివరించారు. రుణ మంజూరు ఉత్తర్వులు తాను సృష్టించినవి కాదని చెప్పారు.

2014 నుంచి 2025 వరకు కంపెనీ వినియోగించిన నిధులు రూ.109 కోట్ల 11 లక్షలేనని, అన్ని బ్యాంకులు కూడా అంతే మొత్తాన్ని ఎన్‌పీఏగా గుర్తించాయని తెలిపారు. అదే కాలంలో రూ.44 కోట్ల 81 లక్షలు చెల్లించామని, ఆంధ్ర బ్యాంక్ ఎన్‌పీఏ అయిన తర్వాత కూడా రూ.18 కోట్ల 72 లక్షలు చెల్లించామని చెప్పారు. 2024 అక్టోబర్ 31 నుంచి చెల్లింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా తాను 15 పాఠశాలలు నిర్మించానని పేర్కొన్న ఎమ్మెల్యే... కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అన్నారు. ఇసుక, భూముల వ్యవహారాల్లోనూ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అమెరికా ట్రేడింగ్ మార్కెట్ పతనం తర్వాత రూ.160 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తే పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంత్రి పదవి చర్చకు వచ్చిన ప్రతిసారి తనపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని ఆరోపించిన ఆయన... తమ జిల్లా నాయకులే తనపై కుట్ర చేశారని అన్నారు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.

MLA Prem Sagar Rao, CM Revanth reddy, Congress party, Allegations False,Legal Action Warning, Political Conspiracy Claim
 

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.