కోవూరు కొలిమి.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలతో కాక

Publish Date:Jul 8, 2025

Advertisement

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే.. నోటి దురుసు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల ఆగ్రహానికి గురవుతోంది.

స్థానిక ఎమ్మెల్యే తనకు సోదరి వరుస కూడా అయిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పార్టీలోని కొందరు అంటుంటే.. వాటిని ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడ్డమేంటన్న చర్చకు తెరలేచింది. నల్లపరెడ్ల పరువు మొత్తం తీస్తున్నావుగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ప్రసన్న ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్ర  పదజాలంతో కామెంట్ చేశారు. అంతే కాదు.. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైతం అనరాని మాటలు అన్నారు. వీపీఆర్ గా పేరున్న ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని.. ఆయన్ను హతమార్చడం కోసం కొన్ని టీములు సుపారీ సిట్టింగులు వేసినట్టుగా తనకు సమాచారముందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. పోయి పోయి పలు చోట్ల తిరిగి పీహెచ్డీలు చేసొచ్చిన.. ప్రశాంతిరెడ్డిని పెళ్లాడే బదులు తనకు చెప్పి ఉంటే.. ఒక మంచి కన్నెపిల్లను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడ్నని అనడంతో ఇప్పుడు కోవూరు మొత్తం కొలిమిలా తయారైంది. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై దాడి జరిగింది. దీంతో నెల్లూరు మొత్తం అట్టుడుకుతోంది. తెలుగుదేశం- వైసీపీ మధ్య పొలిటికల్ వార్ షురూ అయ్యింది.

అదలా ఉంటే తనపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు.  ఒక్క మహిళా ఎమ్మెల్యేగా తాను ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే..సభ్య సమాజం చెవులు మూసుకునే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత భాషా ప్రయోగం చేశారని విమర్శించారు.  అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడి మా నోరు మూయిద్దామనుకుంటున్నావా? అని నిలదీశారు. ఒక మాజీ మంత్రి అయి ఉండీ మహిళల పట్ల ఇంత నీచంగా, అసభ్యంగా మాట్లాడడాన్ని బట్టే ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తోందన్నారు.  

ఇక ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.  ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల చెప్పుకోలేని బాధలు అనుభవించిన చాలా మందిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండవచ్చన్నారు. అయినా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ఒక సూటి ప్రశ్న అన్న ఆమె..  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మీ ఇళ్లల్లోని మహిళలకు వినిపించగలరా అని నిలదీశారు.   ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

By
en-us Political News

  
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.