ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయ కులు, పోలీసు ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ అధికారులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా గన్‌మెన్‌లను కేటాయించ డం సర్వసాధారణం. అయితే ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు వ్యక్తిగత భద్రత కోసం గన్‌మెన్‌లు అవసరం లేదని ఆయన మొదటి నుంచీ చెబుతూవస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు. ప్రజల మధ్య ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ వ్యక్తిలా ఉండాలనేదే తన అభిప్రాయమని అప్పట్లోనే వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం (జులై 7) ఆయన భద్రత కోసం గన్‌మెన్‌లు నివాసానికి వెళ్లగా.. లక్ష్మారెడ్డి వారిని వెనక్కి పంపించారు. తన భద్రతను తానే చూసుకుంటానని, గన్‌మెన్‌లు లేకుండా ప్రజల్లో తిరగడమే తనకు సౌకర్యంగా ఉంటుందని వారికి వివరించారు. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని మరోసారి స్పష్టం చేయడంతో గన్‌మెన్‌లు అక్కడి నుంచి వెనుదిరిగారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-laxma-reddy-sent-back-his-gunmen-25-225350.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.