నన్ను ప్రశ్నించండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమం

Publish Date:May 26, 2026

Advertisement

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.   ప్రజాప్రతినిధి అంటే కేవలం ఓట్లు వేయించుకుని ఐదేళ్లపాటు కనిపించకుండా పోవడం కాదనీ..  ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత కలిగిన సేవకుడని నిరూపిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త జవాబుదారీతనానికి నాంది పలుకుతూ ఆయన  నన్ను ప్రశ్నించండి అనే వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికీ, ముఖ్యంగా యువతకు తమ నాయకుడిని నేరుగా నిలదీసే హక్కును కల్పించారు. ప్రజాప్రతినిధికి   ఓటేసి గెలిపించిన ప్రజలకు తమ సమస్యలపై, నియోజకవర్గ ప్రగతిపై ప్రశ్నించే పూర్తి హక్కు ఉందని ఆయన ఈ సందర్భంగా  ప్రకటించారు.  ఈ వినూత్న కార్యక్రమం ప్రధాన ఉద్దేశం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతరంలో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.  

తన నియోజకవర్గంలో  ప్రారంభమైన ఈ చైతన్యం కేవలం నెల్లూరుకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా,  దేశవ్యాప్తంగా ఒక బలమైన ఆలోచనగా మారాలని  ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలంటే ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలే కీలకమని, నాయకులు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు.  ఇదే సమయంలో నియోజకవర్గంలోని పలు కీలక రాజకీయ, పాలనా పరమైన అంశాలపై కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వార్డుల  డీలిమిటేషన్ ప్రక్రియలో కొన్ని పొరపాట్లు జరిగాయని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియపై కొన్ని అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ విషయంలో తాను ఏ రోజూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. నెల్లూరు డీలిమిటేషన్ ప్రక్రియ  నిబంధనల ప్రకారం సాగేలా అధికారులకు పూర్తి స్వేచ్ఛ  ఇచ్చామని  వెల్లడించారు.  మరోవైపు, రాబోయే ఎన్నికలు,  రాజకీయ భవిష్యత్తుపై నెల్లూరు రూరల్ రాజకీయాల్లో వినిపిస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని పూర్తిగా పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.  ఒకవేళ అధిష్ఠానం తమకు కాకుండా మరొకరికి ఈ సీటు కేటాయించాలని నిర్ణయిస్తే, తాము కచ్చితంగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామని మరియు పార్టీ విజయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా హుందాగా ప్రకటించి అందరినీ విశ్మయపరిచారు.

By
en-us Political News

  
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డాలో చిన్నారి బాలుడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల చర్యల కథనం.
హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లోని ఒక ఓయో హోటల్ గదిలో యువతి దారుణంగా హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు మరియు హత్యకు గల కారణాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో బీభత్సం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పక్కా ప్లాన్‌తో 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రిベンజ్ మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.