Publish Date:Mar 20, 2023
కొంచం ఆలస్యంగానైనా వైసీపీకి వాస్తవం బోధపడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా మాట్లాడిన వారంతా పట్టభద్రులు మా ఓటర్లు కాదు, సమాజంలో వారు చిన్న సెక్షన్ మాత్రమే అంటూ వచ్చారు. కానీ తొలి సారిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ కు బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల్లో, ఉపాధ్యాయుల్లో మా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయని అంగీకరించారు.
అయితే అంత మాత్రాన తెలుగుదేశం సంబరాలు చేసేసుకోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో అర్థమయిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఓటర్లలో వీరు కేవలం రెండు శాతం మాత్రమేననీ, అయినా ఓ మూడు ఎమ్మెల్సీ సీట్లకే రాష్ట్రంలో అధికారం చేపట్టేసినట్లు టీడీపీ నేతలు సంబరపడిపోవడం హాస్యాస్పదంగా ఉందని బాలినేని ఎద్దేవా చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-balineni-accepts-defeat-25-152733.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.