Publish Date:Apr 30, 2026
ఎండల వేడిమి తీవ్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించేటప్పుడు ఉపశమానం పొందేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ బూత్ లలో మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గురువారం (ఏప్రిల్ 30) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూలింగ్ గ్లాసెస్ ను పంపిణీ చేశారు.
ట్రాఫిక్ బూత్ లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఎండల తీవ్రత దృష్ట్యా ఉపశమనం పొందేందుకు జిల్లా ఎస్పీ చోరవతో చల్లటి నీటి తుంపరలను చల్లే ఫ్యాన్ లు (మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్) ఏర్పాటు చేశారు. ఈ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ఎండ వేడిమి తగ్గించడానికి నీరు జల్లుతూ చల్లదనాన్ని పంచుతాయి. ఈ ఏర్పాట్లతో ఎర్రటి ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చల్లటి గాలిని అందించి వేడి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో డిస్పీ తిరుపతిరావు, టౌన్ సి.ఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్.ఐ అరుణ్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mist-cooling-systems-in-traffic-booths-36-218635.html
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెట్రోల్ బంక్‌లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.
ఇది సాధారణ చోరీ ప్రయత్నమా.. అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్, పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్‌కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు.
జపాన్ ప్రధానమంత్రి సనాయే టకాయిచీతో ఫోన్ లో మాట్లాడిన పెజెష్కియాన్, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని విమర్శించారు. ఇరాన్ నౌకలపై అమెరికా పాల్పడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వైశాఖ పూర్ణిమ వేడుకల కోసం జల్జలా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. థవాంగ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్జలా వద్ద బురదతో కూడిన ఇరుకైన రోడ్డుపై జీపు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వాహనం జారిపోయి లోయలోకి దూసుకెళ్లింది.