మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల ఆర‌బోత‌

Publish Date:Apr 19, 2025

Advertisement

ఇంత‌కీ ఏంటీ పోచంప‌ల్లి ఇక్క‌త్ చీర ప్ర‌త్యేక‌త‌?
అన‌సూయ‌ది కూడా పోచంప‌ల్లి అంద‌మేనా! 

మే 7 నుంచి మే 31 వ‌ర‌కూ హైద‌రాబాద్ లో జ‌రిగే మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల‌ను ప్ర‌ద‌ర్శించేలా ఒక ఏర్పాటు చేయ‌నుంది రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ. ఈ పోటీల సంద‌ర్భంగా ఇక్క‌డికి 140 దేశాల‌కు సంబంధించిన వారు రానున్నారు.  వీరిని మే 15న పోచంప‌ల్లికి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు. 

అంతే కాదు వీరి చేత పోచంప‌ల్లి వ‌స్త్రాల‌ను ధ‌రింప చేసి.. ప్ర‌మోట్ చేయాల‌నుకుంటున్నారు. ఇందు కోసం పోచంప‌ల్లి చేనేత క‌ళాకారుల చేత ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయించ‌నుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. స్థానిక చేనేత క‌ళ‌ల‌పై అతిథుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం మాత్ర‌మే కాక‌.. ఆయా వ‌స్త్రాల  ప్ర‌త్యేక‌త‌ల‌ను తెలియ చేయ‌నున్నారు. 

క‌ళాకారుల‌తో అతిథులు మాట్లాడ్డానికి గానూ.. ట్రాన్స్ లేట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చేనేత కళ ప్రమోషన్ విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, పట్టుదలతో ఉందో  ఊహించుకోవ‌చ్చు. అలాగే, గద్వాల్‌ సిల్క్‌, సిద్దిపేట దగ్గరలోని గొల్లభామ కాటన్‌, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా పోచంపల్లిలో ఏర్పాటు చేయ‌నున్నారు. 

పోచంపల్లి పర్యటనకు వచ్చిన వారంతా ఈ స్టాల్స్‌ను కూడా సందర్శిస్తారు. ఆయా స్టాల్స్‌లో ప్రదర్శించే వస్త్రాల విశేషాలు కూడా విదేశీయులకు అర్థమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ ప

ర్యటన మొత్తం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనుండగా..  విదేశీ అతిథుల కోసం పోచంపల్లిలో తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.దీంతో ఎక్క‌డిదీ పోచంప‌ల్లి అన్న చ‌ర్చ మొద‌లైంది. ఇది  తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రాంతం.

పోచంప‌ల్లి చేనేత క‌ళాకారులు నిలువు పేక‌ల మ‌గ్గంపై నేసిన చేనేత క‌ళాఖండాల‌కు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు ఉంది. హైద‌రాబాద్ కి 35కిలోమీట‌ర్ల దూరంలో ఉండే పోచంప‌ల్లి.. ఇటు చేనేత‌, అటు భూదానోద్య‌మానికి ప్ర‌సిద్ధి చెందిన‌ది.

ఇక్క‌డ చేనేత చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే  స్త్రీ మూర్తులంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ఈ చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా  ఉన్న  ఆయా ప్రాంతాల మేని ఛాయ‌ల‌న్నిటికీ న‌ప్పి.. ఆయా స్త్రీమూర్తుల‌లోని మ‌హిళా శ‌క్తిని  మ‌రింత ప్ర‌జ్వ‌రిల్లేలా చేస్తాయి. అందుకే పోచంప‌ల్లి చీర కేవ‌లం మ‌హిళ ఒంటిని మాత్ర‌మే కాదు ఈ భూగోళం మొత్తం  చుట్టేసిన ఖ్యాతి సంపాదించిందని అంటారు. 

అలాంటి పోచంప‌ల్లిలో తొలుత నూలు చీర‌లు మాత్ర‌మే నేసేవారు. డెబ్భైల నుంచీ ప‌ట్టు చీర‌ల త‌యారీ మొద‌లైంది. ఇద్ద‌రు యువ‌కుల‌ను బెంగ‌ళూరుకు పంపి ప‌ట్టు నేతలో మెల‌కువ‌లు తెలుసుకోమ‌న్నారు. ఇది పోచంప‌ల్లి చేతి మ‌గ్గాల ద‌శ- దిశ మార్చేలా చేసింది. ఈ చీర‌లు ఎంతో మోడ్ర‌న్ గా ఉంటాయి. ఈ చీర‌ల త‌యారీ ఇక్క‌త్ మీద ఆధార‌ప‌డుతుంది. ఈ ప‌నిత‌నం చీరాల నుంచి ఈ ప్రాంతానికి వ‌చ్చిందని అంటారు. నూలుతో చేసిన ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అది ప‌ట్టు మీద కూడా చేయ‌డం మొద‌లెట్టారు.

గుజ‌రాత్, ఒడిశాలాగా ఇక్క‌త్ నేత‌కు తెలంగాణ‌లోని పోచంప‌ల్లి ఎంతో ఫేమ‌స్ అయ్యింది. 1953 లో తొలిసారిగా పోచంపల్లిలో ఇక్కత్ కళ మొదలైంది. కర్నాటి అనంతరాములు అనే పెద్దాయన గుజరాత్ లోని బెనారస్ వెళ్లి.. అక్క‌డ‌ శిక్షణ తీసుకుని సిల్క్ తో ఇక్కత్ కళను వెలుగులోకి తెచ్చారు. ఇక్కత్ కళకు 2003 లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి. 

ఇక్కడ ఉత్పత్తయ్యే చేనేత చీరలు 2 వేల రూపాయల నుంచి యాభై, అరవై వేల రూపాయల వరకు ధర పలుకుతాయంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన‌ ప్రముఖ సినీతారలు, అనేక మంది రాజకీయ నాయకులు, ఇతర దేశాల నుంచి వ‌చ్చిన‌ మహిళలు.. పోచంపల్లి చేనేత కార్మికులు తయారుచేసిన చీరలపై ఎక్కువ‌గా మక్కువ చూపుతుంటారు.  

తెలంగాణ గాంధీగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ చొరవతో చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. దీంతో పోచంపల్లి చేనేత పరిశ్రమ కేవలం పోచంపల్లికి మాత్ర‌మే పరిమితం కాకుండా జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, సిరిపురం, ఎల్లంకి, రామన్నపేట, నాగారం, బోగారం గ్రామాలకు విస్తరించింది. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఎంద‌రో కార్మికులకు పోచంపల్లి డిజైన్ చీరలు ఉపాధి కల్పిస్తున్నాయి. 

ఇక్కడి చేనేత టైఅండ్ డై అసోసియేషన్, చేనేత సహకార సంఘం ఎంతో కృషి చేసి 30 రకాల డిజైన్లకు పేటెంట్ హక్కు కల్పించాలని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కి పలుమార్లు విన్నవించింది. కానీ, కేవలం 11 రకాల డిజైన్లనే పేటెంట్ హక్కును కల్పించేందుకుగాను 1999లో గుర్తించింది. 2000లో పేటెంట్ హక్కును కల్పించారు. దేశచరిత్రలో కార్మికుడు సాధించిన ఘన విజయంగా దీనిని అభివ‌ర్ణిస్తారు.

పోచంపల్లి చీరకు 2005లో భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంటలెక్చుయల్ రైట్స్ కి ర‌క్ష‌ణ‌ లభించింది. పోచంపల్లి లో తయారైన ఇక్కాత్ శైలి పోచంపల్లి చేనేత సహకార సంస్థ లిమిటెడ్, పోచంపల్లి హాండ్లూం టై అండ్ డై సిల్క్ సారీస్ తయారీ అసోసియేషన్ రిజిస్టర్డ్ ప్రోపర్టీగా గుర్తింప బడింది.

అయితే పోచంప‌ల్లి ఇక్క‌త్ కి న‌కిలీలు రావ‌డం మొద‌లైంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి పోరాడుతూ.. పార్ల‌మెంటులో గ‌ళ‌మెత్తారు. అంతే కాదు, వాణిజ్య మంత్రికి ఈ దిశ‌గా ఒక లేఖ సైతం రాశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోచంపల్లి ఇక్కత్‌ చీరల నకిలీలను అరికట్టి.. చేనేత రక్షణ కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ చామల త‌న లేఖ‌లో కోరారు.

ఇక పోచంప‌ల్లి మ‌రో అందాల ఆర‌బోత‌ విష‌యానికి వ‌స్తే జబ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ కూడా పోచంప‌ల్లికి చెందిన అంద‌మే. అయితే పోచంప‌ల్లి చీర నూలుతో చేసిన అంద‌మైతే.. అదే అన‌సూయ న‌వ్వుల‌తో త‌యారైన అందం. ఆమె యాంక‌రింగ్ చేసిన‌ జ‌బ‌ర్ద‌స్త్ లో వ‌చ్చే స్కిట్ల‌లో అక్క‌డ కామెడీ ఉన్నా లేక పోయినా త‌ను ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ ఆ ముత్యాల‌ను ప్రేక్ష‌కుల చేత‌ ఏరుకునేలా చేసిన న‌వ్వుల అందం అన‌సూయ‌. ఈమెది కూడా ఈ పోచంప‌ల్లే. వీరికి ఈ ఊరిలో వంద గ‌డ‌ప‌ల ఇల్లు ఒక‌టి ఉంద‌ని స‌మాచారం. ఇది అతి పురాత‌న‌మైన ఇల్లుగా చెబుతారు.

ఇదండీ పోచంప‌ల్లి వెన‌క దాగిన అనేక విశేషాల స‌మాచార స‌మాహారం.. చూశారుగా మ‌న చెంత‌నే ఉన్న పోచంప‌ల్లికి ఎక్క‌డో విదేశీయులు వ‌స్తున్నార‌ని తెలిసి.. ఆరా తీస్తే ఇన్నేసి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి గ‌మ‌నించారా!!!

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.