మిస్ వరల్డ్‌లో రాజకీయ కుట్ర కోణం?
Publish Date:May 25, 2025
Advertisement
మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్యవహార శైలి కాస్త అనుమానాస్పదంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మర్ అయిన మ్యాగీ తన తల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విషయాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వస్తోందని అంటారు కొందరు.మిస్ వరల్డ్ పోటీలకు అనగా ఇప్పటికిప్పుడొచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే 1951లో ఫెస్టివల్ ఆఫ్ ఇంగ్లండ్ లో ఒక బికినీ షోతో మొదలైన ఈ పోటీలు.. ఆనాడే వివాదాస్పదం. ఆ తర్వాత అదిప్పటికి అరడజను సార్లకు పైగా రకరకాల వివాదాలతో తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కుంది. తెలుపు- నలుపు, మతానికి సంబంధించి, ఆపై కోవిడ్ వంటి విషయాల్లో ఈ పోటీలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ మాటకొస్తే హైదరాబాద్ లోనూ వ్యతిరేకతలు ఎదురయ్యాయి. కొన్ని ప్రజా సంఘాల వారు ఈ పోటీలను తొలి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వ్యతిరేకించారు. అయితే ఇక్కడ మ్యాగీ విషయంలో కొన్ని అభ్యంతరాలేంటంటే.. ఇది ఒక ఇంగ్లండ్ కి సంబంధించిన పీజెంట్. ఆమె మరెవరో కాదు మిస్ ఇంగ్లండ్. అలాంటిది తన దేశానికి సంబంధించిన ఒక పోటీలో పాల్గొని.. ఎలాగోలా ఇక్కడి స్థితిగతులను అవగతం చేసుకుని వాటిని పూర్తి చేసి.. ముందుకెళ్లి కిరీటం దక్కించుకోవాలి. ఆమెకంటూ ఈ కిరీటం దక్కదనుకుందో ఏమో తెలీదు. కానీ ఆమె అయితే అర్ధాంతరంగా అది కూడా ఒక అబద్ధం చెప్పి తప్పుకుంది. తన తల్లికి బాగోలేదని ఆమె చెప్పడం విడ్డూరం. ఇది ఎప్పటికీ స్ఫూర్తి కాదు. రెండో విషయం ఇక్కడందరూ తననొక వేశ్యను చూసినట్టు చూస్తున్నారంటే.. అర్ధమేంటి? ఇక్కడో మాట అక్కడో మాట చెప్పడంలో మీనింగ్ ఏమనుకోవాలి?అంటే మిగిలిన కంటెస్టెంట్లంతా వేశ్యలనా? లేక హైదరాబాద్ అంటే అతి పెద్ద విటుల సంఘమనా ఒక రకంగా చెబితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యానాల వల్ల ఆమె ఒక్కరే శుద్ధ పూస మిగిలిన వారాంతా వ్యభిచారులని. అంతేగా దీనర్ధం! మరో ముఖ్యమైన విషయం.. ఇటు వచ్చింది సాదా సీదా టూరిస్టుగా కాదు. ఒక దేశానికి ప్రతినిథిగా. పైపెచ్చు ఇదామె దేశానికి సంబంధించిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద బ్యూటీ ఈవెంట్. దాన్ని అపహాస్యం చేయడం అంటే తన దేశాన్ని సైతం అపహాస్యం చేయడంతో సమానం. అదీ మిస్ చేసిందీ మిస్ ఇంగ్లండ్. ఇక పోతే.. వచ్చే రోజుల్లో ఈమె అందానికి దాని వెనక ఉన్న తెలివికి మెచ్చి పొరబాటున ఐక్యరాజ్య సమితి ఈమెకు ఏ సోమాలియాకో పంపి అక్కడి మహిళలల్లో సంస్కరణ తీసుకురావాలని.. వారికంటూ ఆత్మ విశ్వాసాన్ని నూరిపోయాలన్న బాధ్యతలను అప్పగిస్తూ ఒక అంతర్జాతీయ రాయిబారిగా పంపితే అక్కడ వారు ఇలా చేశారు అలా చేశారు. అక్కడి అరటిపండ్లు, ఒంటె పాలు నేను తాగలేక పోయానంటే ఎలా ఉంటుంది?ఇదిలా ఉంచండి. బేసిగ్గా మ్యాగీ ఒక స్విమ్మర్. స్విమ్మింగ్ ఏం చెబుతుంది? ఎన్నేసి అవాంతరాలు ఎదురైనా వాటిని ఈదుకుంటూ వెళ్లాలని. కనీసం ఆ స్పిరిట్ కూడా ఆమె కొనసాగించలేక పోయారు. ఫైనల్ గా ఇక్కడ మ్యాగీ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడున్న కొన్ని ప్రత్యర్ధి పార్టీ ఎన్నారై లింకులు అక్కడ మ్యాగీ మదర్ ని మేనేజ్ చేసి ఉంటారేమో.. అని అంటున్నారు కొందరు. అంతే కాదు ఇక్కడ ఒక రాజకీయ పార్టీ కరపత్రిక ఈ విషయంపై ఎంతో ఆతృత కనబరచి.. తద్వారా ఆమెకు ఫోన్ చేసి మరీ ఈ విషయం ఒక క్లారిటీ తెచ్చుకుని.. అక్కడున్న తమ యూకే ప్రతినిథి చేత ఇది బ్రాండ్ హైదరాబాద్ ఇమేజీకే డ్యామేజీ కలిగించే అంశమంటూ స్టేట్మెంట్ ఇప్పించారంటే.. దీని వెనక ఏ రాజకీయ కుట్ర కోణం లేదనుకోవాలా? అంటున్నారట కొందరు. మరి చూడాలి.. ఇలాంటి కుట్ర కోణాలు ఇందులో మరేవైనా దాగి ఉన్నాయో తెలియాల్సి ఉందంటున్నారు వీరు. ఏది ఏమైనా మ్యాగీ చాలా పెద్ద తప్పు చేశారు. ఇటు తన ఇంగ్లండ్ సంస్థ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కి, అటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి మాయని మచ్చ తెచ్చారు. అంతే కాదు తనతో పాటు పాల్గొన్న ఇతర కంటెస్టెంట్లను కూడా ఆమె ఒక రకంగా వేశ్యలని ఇండెరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది తప్ప కుండా కోటిన్నరకు పైగా జనాభాగల సగటు హైదరాబాద్ వాసి ఖండించాల్సి ఉందని అంటారు కొందరు సామాజిక వేత్తలు. మరి మీరేమంటారు?
మరో ఇంపార్టెంట్ థింగ్.. ఇది బ్యూటీ విత్ పర్పస్ గా 1980ల కాలం నాటి నుంచి ప్రాచుర్యం పొందింది. ఈ మొత్తం ఈవెంట్ ద్వారా సంపాదించిన మొత్తంలోంచి 1 బిలియన్ పౌండ్లను వికలాంగులు, అనాథ బాలలకు ఒక చారిటీగా ఇస్తారు. దీన్ని కూడా ఆమె కనీసం గుర్తించలేదు.ఇక పోతే హైదరాబాద్ కి లండన్ కొ ఒక పోలిక ఏంటంటే.. హైదరాబాద్ లోనూ లండన్లోనూ నదులుంటాయి. లండన్ నగర మధ్య భాగంలో థేమ్స్ నది ఉన్నట్టు.. ఇక్కడ కూడా మూసీ నది ఉంటుంది. ఈ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు నడుం బిగించింది. తాను వచ్చేటపుడు ఈ విషయం కూడా తెలుసుకుని.. తాను ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు సేకరించి తన వంతు బాధ్యత తీసుకోవచ్చు.
http://www.teluguone.com/news/content/miss-england-maggie-39-198656.html





