మైనర్లకు వాహనాలు అప్పగిస్తే జరిగే ప్రమా దాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో మరో ఘటన చాటిచెప్పింది. రాయదుర్గం పరిధిలో మైనర్ బాలుడు నడిపినట్లు చెబుతున్న కారు అతివేగంగా దూసుకెళ్లి రోడ్డు దాటుతున్న ముగ్గురు స్నేహితులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాకు చెందిన సుదీప్తి దాస్ అక్కడి కక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సుదీప్తి దాస్, సౌమెన్ రాయ్, అభిజిత్ రాయ్ ముగ్గురు స్నేహితులు. వీరు షేక్‌పేట్ రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డు దాటు తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు ఓ కారు వేగంగా వెళ్తోంది. రోడ్డు దాటుతున్న ముగ్గురు స్నేహితులను గమనించక పోవడం లేదా వాహనాన్ని అదుపు చేయలేకపోవడమో తెలియదు కానీ కారు అత్యంత వేగంగా వెళ్లి వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు బలంగా ఢీకొట్టడం తో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సుదీప్తి దాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు సౌమెన్ రాయ్, అభిజిత్ రాయ్‌ల కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కారును మైనర్ బాలుడు నడుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అనుమాని స్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరు ఉన్నారు? కారు యజమాని ఎవరు? మైనర్ బాలుడికి వాహనం ఎలా అందింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదం డ్రులు, వాహన యజమా నులు బాధ్యత వహించా ల్సిన అవసరం ఉందని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. రాయదుర్గం ఘటనలో ఒక నిండు ప్రాణం కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఒకవైపు మైనర్ డ్రైవింగ్, మరోవైపు అతివేగం.. వెరసి ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Minor driving in Rayadurgam, West Bengal, Hooghly District, Sudeepti Das, Soumen Roy, Abhijit Roy, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minor-driving-in-rayadurgam-36-228309.html
అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.
లైనక్స్ వినియోగదారుల కోసం NordVPN వర్షన్ 5.3.0 నూతన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆటోమేటిక్ GUI యాప్ ఇన్స్టాలేషన్, కొత్త డయాగ్నోస్టిక్స్ కమాండ్ మరియు సిస్టమ్ సపోర్ట్ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోండి.
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు విరామం ఇచ్చి చర్చలకు మార్గం సుగమం చేసినా.. దిగి రావడానికి ఇరాన్ ససేమిరా అంటోంది.
దశాబ్దాల నాటి పాత ఎస్‌క్యుఎల్ ఇంజెక్షన్ లోపం మరియు ఒరాకిల్ డేటాబేస్ ట్రిక్ ఉపయోగించి హ్యాకర్లు విండోస్ సర్వర్లను ఎలా హైజాక్ చేస్తున్నారో తెలుసుకోండి. ఖంట్ టూల్‌కిట్ ప్రమాదం మరియు సెక్యూరిటీ రక్షణ చిట్కాలు ఇక్కడ చూడండి.
ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు డీకే శివకుమార్ 3 కొత్త భారీ పార్కులను ప్రకటించారు. 452 ఎకరాల వైమానిక దళ స్థలంతో పాటు నగర అటవీ ప్రాంతాల్లో లాల్‌బాగ్ తరహా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఐకియా, డెలాయిట్ సమీపంలోని రూ. 2,000 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం కోర్టు వివాదాల వల్ల 15 లక్షల టన్నుల అక్రమ డంపింగ్ యార్డ్‌గా మారిన పూర్తి కథనం.
హైదరాబాద్ బస్తీల నుంచి టీమిండియా స్టార్ బౌలర్‌గా, తెలంగాణ డీఎస్పీగా ఎదిగిన మహమ్మద్ సిరాజ్ స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ, ఆస్తుల విలువ, ఐపీఎల్ సంపాదన మరియు బ్రాండ్ డీల్స్ వివరాలు.
పాకిస్థాన్ హోంమంత్రి హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో గత ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. , దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని తాను బయటపెట్టానని, అందులో ప్రముఖ రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.
భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ 2026లో అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్టీవ్ వా, అభిషేక్ బచ్చన్ యజమానులుగా ఉన్న ఈ జట్టులో రహానే సరికొత్త ఇన్నింగ్స్ వివరాలు తెలుసుకోండి.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖలు మార్చే అత్యంత ప్రాధాన్యమైన పనుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఒకటి.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నీట్ పరీక్ష లీకేజీ వివాదాలు దానికి అనుబంధంగా జరిగిన నిరసనలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.