మంత్రి విడదల రజని.. సినీ నిర్మాతగా కొత్త అవతారం!

Publish Date:Feb 12, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఇప్పుడు తన దృష్టిని టాలీవుడ్‌పై ఫోకస్ చేశారు. సినిమా  నిర్మాతగా ఆమె కొత్త అవతారం ఎత్తబొతున్నారు. ఇందు కోసం ఇప్పటికే  హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో మంత్రి విడదల రజిని కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సినిమాలపై ఆసక్తితోనే ఆమె ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ఫిల్మ్ నగర్ తో పాటు, వైసీపీలో కూడా చెప్పుకుంటున్నారు. 

రజనీ నిర్మాలగా   తొలి సినిమాకు కథ కూడా సిద్ధమైందని అంటున్నారు.  చిత్ర దర్శకుడు, హీరో ఇత్యాది విషయాలపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని చెబుతున్నారు.      సినిమా భారీ బడ్జెట్ తోనే విడదల రజని నిర్మించబోయే సినిమా తెరకెక్కబోతోందని  ఫిలింనగర్‌ వర్గాలు చెబుతున్నాయి.  

2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కోసం.. యూఎస్ నుంచి ఎన్నారైల బృందం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. వారిలో విడదల రజినీ కూడా ఒకరు. అలా ఆ ఎన్నికల్లో రజని తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.   2017లో విశాఖపట్నంలో నిర్వహించిన మహానాడు వేదికపై నుంచి తెలుగుదేశం అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత 2018లో  వైసీపీలో చేరి... 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి  విజయం సాధించారు. జ

గన్ మలి కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడదల రజినీ బాద్యతలు చేపట్టారు. అయితే తొలిసారి ఇలా ఎమ్మెల్యే అయి.. అలా మంత్రి పదవి చేపట్టి విడదల రజినీ.. వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె.. అడుగులు పాలిటిక్స్ నుంచి సినిమా రంగం వైపు  పడుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.  జగన్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు టాలీవుడ్‌లోని నటీనటులు, దర్శక, నిర్మాతలతో స్నేహ సంబంధాలు, బంధుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే.  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు నర్సిపట్నం ఎమ్మెల్యే పి. ఉమా శంకర్ గణేశ్, మరో దర్శకుడు కురసాల కళ్యాణ కృష్ణ సోదరుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పలు చిత్రాల్లో నటించారు. 

విశాఖ ఎంపీ సత్యనారాయణ సైతం.. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా.. నటిస్తున్నారు కూడా. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా.. సినీమారంగం నుంచే రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాజమండ్రి ఎంపీ మారగాని భరత్ కూడా సినిమాలో నటించారు. అలాగే ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ సమీప బంధువు కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ప్రముఖ నటుడు అలీ, పోసాని కృష్ణమురళీ ఉండనే ఉన్నారు.  అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ జాబితాలో మంత్రి విడదల రజినీ   చేరారు.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.