కేంద్రం సన్న బియ్యం ఇస్తే ప్రధాని ఫొటోపై ఆలోచిస్తాం : మంత్రి ఉత్తమ్

Publish Date:Aug 15, 2026

Advertisement

 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ కార్డులు, రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడొద్దని, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను అభినందించాలని ఆయన కోరారు.రాష్ట్రవ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత తీసుకురావడం, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడమే లక్ష్యంగా స్మార్ట్ కార్డుల విధానాన్ని తీసుకొచ్చా మని చెప్పారు.

రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం భారీ స్థాయిలో సన్న బియ్యం అందిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పేదలకు నాణ్య మైన బియ్యం అందించ డమే ప్రభుత్వ లక్ష్యమ న్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14,900 కోట్లు వెచ్చిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చొద్దని సూచించారు. గతంలో అరకొరగా రేషన్ బియ్యం అందించిన వారు, అసలు ఇవ్వని వారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.“

మా ప్రయత్నాన్ని విమర్శించడం మాని అభినందించండి. పేదల కడుపు నింపే కార్యక్రమం పై రాజకీయాలు చేయొద్దు” అని మంత్రి ధ్వజమెత్తారు. స్మార్ట్ కార్డులపై ఫొటోల అంశంపైనా మంత్రి స్పందించారు. రాజకీయ నాయకులు తమ కార్డుల్లో ఫొటోలు పెట్టుకోవద్దని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని తెలిపారు. అయితే స్మార్ట్ కార్డుల ప్రధాన ఉద్దేశం ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శ కంగా అందేలా చూడటమే నని చెప్పారు.

రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఏర్పాటు చేయడంపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తూ, ప్రోటోకాల్ ప్రకారం రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో పెడుతు న్నామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం కోసం పూర్తి ఖర్చును భరిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని అన్నారు.“కేంద్రం పూర్తిగా భరించి సన్న బియ్యం ఇస్తే.. అప్పుడు మోదీ ఫొటోపై ఆలోచన చేస్తాం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సన్న బియ్యం, స్మార్ట్ కార్డుల అంశాలపై రాజకీయ రాద్ధాంతాలు చేయకుండా, పేదలకు అందుతున్న ప్రయోజ నాలను చూడాలని మంత్రి సూచించారు. కేంద్రం అందిస్తున్నది దొడ్డు బియ్యం మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భారీగా ఖర్చు చేసి ప్రజలకు సన్న బియ్యం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, పేదలకు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Minister Uttam Kumar Reddy, Ration smart cards, PM MODI, CM Revanth reddy, Civil Supplies Department

By
en-us Political News

  
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.