Publish Date:Jul 23, 2024
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్రదిష్ట మూట గట్టుకుంటున్నారు.
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దివ్యాంగులను అవమానించేలా మాట్లాడిన స్మిత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క స్మిత సబర్వాల్ సీరియస్ అయ్యారు. వికలాంగులను అవమానపరిచేలా ఆమె వ్యాఖ్యలున్నాయన్నారు. ఇప్పటికే ఈ విషయంలో స్మితను తప్పుబడుతూ పలువురు ప్రముఖులు స్పందించగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశంపై స్పందించారు. స్మిత ట్వీట్ దివ్యాంగులను కించపరిచేలా ఉందని విమర్శించారు. దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మిత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.స్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సమాజంలో గౌరవప్రదంగా ఉండాలనే ఆలోచనతో వికలాంగులు అనే పదం స్థానంలో దివ్యాంగులుగా వ్యవహరించాలని మోదీ సర్కారు 2016 లో చట్టం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ చర్య దివ్యాంగుల మనోబలాన్ని పెంచిందని పేర్కొన్నారు. దివ్యాంగులపై చేసిన ట్వీట్ ను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని స్మిత సబర్వాల్ కు సూచించారు. అదేవిధంగా ఈ విషయంపై స్పందించి ప్రభుత్వపరంగా స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-sitakka-is-serious-about-smita-sabharwal-25-181313.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.