అయ్యో పాపం రోజా మేడం అవుటై పోయారు!

Publish Date:Sep 29, 2022

Advertisement

అయిపొయింది,. మంత్రి రోజా నోటికి గట్టిగానే పని చెపుతున్నారు.అంతకు ముందు ఎలా ఉన్నా కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె మాటల దూకుడు పెంచారు. అంతవరకు ఉన్న కొద్ది పాటి  కట్టుబాట్లను కూడా తెంచుకుని మరీ రెచ్చి పోయారు. ఏమి మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నామో తెలియకుండా, కనీసం స్థాయి బేధం అయినా, పట్టించుకోకుండా,   పోయి ప్రతిపక్షమ మీద విరుచుకు పడుతున్నారు. 

అయినా, నోరు దాచుకోకుండా అంతలా కష్ట పడుతున్నా, చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆమెను,’గడప గడప’కు పరీక్షలో ‘ ఫెయిల్ చేశారు. పనితనం పెంచుకోక పొతే, పక్కన పెట్టక తప్పని హెచ్చరించారు‘గడప గడప’ పరీక్ష ఫెయిల్ అయిన ఏమ్మేల్యేల  ఫస్ట్ లిస్ట్’ లోని  27 ఎమ్మెల్యేలలో  మంత్రి ఆర్కే రోజా పేరు కూడా వుంది. అఫ్కోర్స్, ఆమెతో పాటుగా, తానేటి వనిత, కారుమూరు నాగేశ్వరరావు,  బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా ఉన్నారను కోండి, అది వేరే విషయం. కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షం రోజుల్లోనే రోజాకు  రెండవ సారి వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా ఇదే ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించడంతో రోజా రాజకీయ భవిష్యత్ ఏమిటనే విషయంలో ఆమె సన్నిహిత వర్గాల్లో చర్చ మొదలైంది. చివరకు రోజా పరిస్థితి, ‘ఒక్క సారి మంత్రి చేయి గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ’ అన్న చందంగా మారుతుందా అన్న ఆందోళన ఆమె సన్నిహితుల్లో మొదలై నట్లు, చెపుతున్నారు. 

నిజానికి, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. చివరకు అసెంబ్లీలో దూకుడు ప్రదర్శించి సంవత్సరం పాటు సస్పెండ్ కూడా అయ్యారు. ఒక విధంగా వైసీపీ ఫేస్ గా, జగన్ రెడ్డి, ఇన్నర్ సర్కిల్ లో ఒకరుగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ లోనే తనకు బెర్త్ ఖాయమన్న ధీమాతో, రోజా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోయారు. ఎంతవరకు నిజమో ఏమో కానీ, ప్రమాణ పత్రం తెచ్చుకుని బట్టీ పట్టారని కూడా అంటారు. అయితే  జగన్ రెడ్డి  రోజాకు తొలి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టారు. ఆ విధంగా, కలలలో తేలియాడుతున్న రోజా, జగనన్న ఇచ్చిన షాక్ కు ఖగుతున్నారు.అవాక్కయ్యారు అని  అంటారు.  

 ఇక అక్కడి నుంచి మంత్రి వర్గ విస్తరణ కోసం. ఇంకా తెలవారదేమి అంటూ  చకోరా పక్షిలా ఎదురు చూశారు. గుళ్లూ గోపురాలూ తిరిగారు. నోములూ వ్రత్రాలూ చేశారు. జ్యోతిషులను నమ్మి శాంతులు, హోమాలు గట్రా చేయించారు. ఒకటని కాదు, ఏమేమి చేయాలో అన్నీ చేశారు. చివరకు ఏ దేవుడు కరుణించాడో, ఏ ప్రభువు ఆశ్వీదరించారో, గానీ, ఆమె కల నెరవేరింది. జగనన్న కొంచెం ఆలస్యంగానే అయినా, రెండవ విడత, గత డిసెంబర్ లో చేపట్టిన మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు అవకాశం కల్పించారు. పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖను కేటాయించారు. శాఖ ఏదైతేనేం మంత్రి అయ్యానని ఆమె హ్యాపీహ్యపీస్ గా సంతోషంగా ఉన్నారు. 

అయితే, మంత్రి పదవి వచ్చి ఇంకా నిండా ఆరు నెలలు అయినా నిండక ముందే,   పిడుగులాంటి వార్త వచ్చి పడింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెట్టిన, గడప గడపకు పరీక్షలో రోజా ఫెయిల్ అయ్యారని, స్వయంగా ముఖ్యమంతే అందరి ముందు ప్రకటించారు.

రెండు నెలలు సమయమిచ్చి, ఈలోగా, పాస్ మార్కులు తెచ్చుకుంటే సరి, లేదంటే మంత్రి పదవి కాదు, ఎమ్మెల్యే టికెట్’కే భరోసా లేదని ఖరా ఖండిగా, చెప్పారు. దీంతో, మంత్రి పదవి మూడునాళ్ళ ముచ్చటేనా, అనే విషాదం యోగంలోకి రోజా  జరుకున్నారని అంటున్నారు. చివరకు ఎమౌతుందో, ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే రోజా రాజకీయ జీవితం తెర మరుగయ్యే హెచ్చరికలు మాత్రం బలంగానే,వినిపిస్తున్నాయని, అంటున్నారు.ఆమె అభిమానులు  అయితే అయ్యో పాపం రోజా మేడం ..అవుటై పోయారు...అంటూ పాడుకుంటున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.