Publish Date:Oct 15, 2024
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి నిమ్మల రామానాయుడు అలర్ట్ అయ్యారు. అధికారులను అలర్ట్ చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులతో మంత్రి రామానాయులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నాలుగు రోజుల్లో ఎంత వర్షం కురిసే అవకాశం వుంది.. ఎంత నీరు వస్తుంది అనే అంచనాలు వేసి, దానికి అనుగుణంగా ఫ్లడ్ మానేజ్మెంట్, వాటర్ మానేజ్మెంట్ చేయాలని అధికారులకు సూచించారు. వాగులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రిజర్వాయర్లకు ఎంత నీరు వస్తుందనేది అంచనావేసి ఆనకట్టల పటిష్టతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మంత్రి నిమ్మల రాత్రిబవళ్ళు దగ్గరుండి పనులను పర్యవేక్షించిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-nimmala-on-rains-25-186804.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.